రవితేజ 'రొమాంటిక్ రిషి'
క్రేజీ స్టార్ రవితేజ చిత్రాలకు విలక్షణ టైటిల్స్ ఎప్పుడూ ప్లస్ పాయింట్ అవుతుంటాయి. తాజాగా రవితేజ కథానాయకుడుగా యువ దర్శకుడు హరీష్ శంకర్ ('షాక్' ఫేమ్) దర్శకత్వంలో ఎల్లో ఫ్లవర్స్ పతాకంపై రమేష్ పుప్పాల ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఈనెల 25 నుంచి ఈ కొత్త చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుంది. దీనికి 'రొమాంటిక్ రిషి' అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం.
రవితేజ హీరోగా నటించే ఈ చిత్రానికి హరీష్ శంకర్ అద్భుతమైన కథ రెడీ చేశారనీ, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ ఎత్తున అత్యున్నత సాంకేతక విలువలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తామనీ రమేష్ పుప్పాల చెబుతున్నారు. ఈ చిత్రానికి ఆర్.డి.రాజశేఖర్ సినిమాటోగ్రఫీ, థమన్ ఎస్. సంగీతం అందించనున్నారు. ప్రస్తుతం రవితేజ మరో రెండు చిత్రాలకు కమిట్ అయ్యారు. వీటిలో గోపీ దర్శకత్వంలో వెంకట్ నిర్మిస్తున్న 'డాన్ శీను' చిత్రం నిర్మాణంలో ఉంది. రమేష్ వర్మ ('రైడ్' ఫేమ్) దర్శకత్వంలో రూపొందనున్న 'వీర' చిత్రం ఆగస్టులో సెట్స్ పైకి రానుంది.
Be first to comment on this News / Article!
|