'కోతిమూక' స్వైరవిహారం
కృష్ణుడు ('వినాయకుడు' ఫేమ్), శ్రద్ధ ఆర్య జటంగా ప్రముఖ కమెడియన్ ఏవియస్ దర్శకత్వంలో తులసి పూజిత ఫిలిమ్స్ పతాకంపై వెంకట్ జగదీష్ నిర్మిస్తున్న చిత్రం 'కోతిమూక'. హైదరాబాద్ లో ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటోంది.
ఏ సినిమాకైనా కథాబలం చిత్ర విజయానికి కారణమనీ, అలాంటి ఓ మంచి కథాంశంతో 'కోతిమూక' రూపొందుతోందనీ నిర్మాత తెలిపారు. దర్శకుడు ఏవియస్ అందించిన కథకు జనార్థన మహర్షి సంభాషణలు మరింత వన్నెతెచ్చాలా ఉన్నాయనీ, ప్రతి సన్నివేశం ఆసక్తి గొలిపేలా ఉంటుందనీ చెప్పారు. మణిశర్మ సంగీతం కూడా ఈ చిత్రాన్ని విజయపథంలో నడుపుతుందనే గట్టి నమ్మకం తమకుందని అన్నారు. కృష్ణుడు, శ్రద్ధ ఆర్య, ఉత్తేజ తదితరులతో కళాశాలకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు, ప్రధాన తారాగణమంతా పాల్గొనగా హీరో ఇంటికి సంబంధించిన దృశ్యాలు ఇటీవల చిత్రీకరించినట్టు చెప్పారు. ఏప్రిల్ నెలాఖరు వరకూ జరిగే షూటింగ్ తో రెండు పాటలు మినహా చిత్రం పూర్తవుతుందని తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో డాక్టర్ బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, ఆలీ, ఎమ్మెస్ నారాయణ, వేణుమాధవ్, ఆహుతి ప్రసాద్, రఘుబాబు, కోవై సరళ, హేమ, ఝాన్సీ, హర్షవర్దన్, గుండు హనుమంతరావు, కొండవలస తదితరులు నటిస్తున్నారు. స్వర్గీయ ఆరుద్ర, భాస్కర భట్ల, రామజోగయ్య శాస్త్రి పాటలు, వి.శ్రీనివాసరెడ్డి సినిమాటోగ్రఫీ, ఎం.ఆర్.వర్మ ఎడిటింగ్ అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|