'దాసన్నా' విజయయాత్ర
హీరోగా తన కెరీర్ కు 'దాసన్నా' చిత్రం మునుపటి ఊపునిచ్చిందనీ, ఇక నుంచి ముఖ్యపాత్రలు చేస్తూనే ఓ ప్లానింగ్ ప్రకారం హీరోగా కూడా నటిస్తానని ఆ చిత్ర కథానాయకుడు శ్రీహరి పేర్కొన్నారు. శ్రీహరి, మీనా జంటగా డి.ఎస్.పి. దర్శకత్వంలో విశాఖ టాకీస్ పతాకంపై నట్టికుమార్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం విజయయాత్ర ఆదివారం రాత్రి హైద్రాబాద్ మూసాపేటలోని శశికళ థియేటర్ లోనూ, కూకట్ పల్లి భ్రమరాంబ థియేట్ లోనూ ప్రేక్షకుల మధ్య జరిగింది. శ్రీహరితో పాటు, నట్టికుమార్, ఫైట్ మాస్టర్ విజయ్, పలువురు యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
శ్రీహరి మాట్లాడుతూ, హీరోగా గ్యాప్ తీసుకున్నందుకు ప్రేక్షకాభిమానులు మన్నించాలనీ, ఇకనుంచి తగు జాగ్రత్తలు తీసుకుంటాననీ చెప్పారు. సినిమాలోని కొన్ని డైలాగ్స్ చెప్పి ప్రేక్షకులను అలరించారు. నట్టికుమార్ మాట్లాడుతూ, 182 కేంద్రాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేశామనీ, దీనిని బట్టే శ్రీహరి స్టామినా అర్ధం చేసుకోవచ్చనీ అన్నారు. ప్రస్తుతం చేపట్టిన చిత్ర విజయయాత్రకు కొనసాగింపుగా వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ కు యూనిట్ సభ్యులతో కలిసి వెళ్తామని చెప్పారు.
Be first to comment on this News / Article!
|