బాలీవుడ్ దర్శకుడితో విష్ణు!
'ఢీ' వంటి హిట్ తర్వాత మంచు విష్ణు మళ్లీ ఫ్లాపుల్లోకి జారుకున్నారు. దాదాపు ఏడాదిన్నర పాటు శ్రమించి పాత్ర కోసం ఆహార్యం స్లిమ్ గా మార్చుకుని ఎన్నో ఆశలు పెట్టుకున్న 'సలీమ్' చిత్రం సోదిలోకి లేకుండా పోవడంతో ఈసారి ఆచితూచి అడుగులేస్తున్నారు. బాలీవుడ్ దర్శకుడు హేమంత్ మధుకర్ దర్శకత్వంలో విష్ణు తదుపరి చిత్రం ఉండబోతోందని తెలుస్తోంది.
హేమంత్ మధుకర్ తెలుగువాడే కావడం విశేషం. రామ విజేత ఫిలిమ్స్ పతాకంపై పలు చిత్రాలు నిర్మించిన సీనియర్ నిర్మాత-దర్శకుడు కె.బాబూరావు తనయుడే హేమంత్. రవిరాజా పినిశెట్టి అసిస్టెంట్ గా, ఆ తర్వాత కో-డైరెక్టర్ గా 12 ఏళ్లు పనిచేసిన విశేషానుభవం ఆయనకు ఉంది. ఇటీవల బాలీవుడ్ లో 'ఫ్లాట్' అనే థ్రిల్లర్ చిత్రానికి ఆయన దర్శకత్వం వహించారు. ఈ నేపథ్యంలో హేమంత్ తో తెలుగులో ఓ సినిమా చేసేందుకు విష్ణు పట్టుదలగా ఉన్నట్టు తెలుస్తోంది. సహజంగానే హేమంత్ బాలీవుడ్ దర్శకుడుగా పేరు తెచ్చుకుంటున్నందున ఆ చిత్రం హిందీలోనూ విడుదలై విష్ణు కెరీర్ కు ఉపయోగ పడనూ వచ్చు.ఈ చిత్రాన్ని విష్ణు తమ సొంత సంస్థలో చేస్తారా, బయట బ్యానర్ లో ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది.
Be first to comment on this News / Article!
|