త్రీడీ థ్రిల్లర్ 'ఓకే'
తనీష్ ('రైడ్' ఫేమ్) కథానాయకుడుగా రూపొందుతున్న తాజా చిత్రం 'ఓకే'. రాజ్ వర్మ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై రాజ్ వర్మ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవం ఉగాది సందర్భంగా హైద్రాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్ లో జరిగింది. తనీష్ పై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి వి.వి.వినాయక్ క్లాప్ ఇవ్వగా, సి.కల్యాణ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. వి.సాగర్ గౌరవ దర్శకత్వం వహించారు.
మనదేశంలో త్రీడీ ఫార్మెట్ తీస్తున్న తొలి సైకిక్ థ్రిల్లర్ చిత్రమిదనీ, తెలుగు, హిందీ భాషల్లో తీస్తున్న ఈ చిత్రాన్ని ఇతర భాషల్లోకి అనువదిస్తామనీ నిర్మాత తెలిపారు. హైద్రాబాద్, విజయవాడలో షూటింగ్ ప్లాన్ చేశామనీ, హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన ఉన్నత శ్రేణి సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పనిచేస్తారనీ, విజువల్ ఎఫెక్ట్స్, సౌండ్ ఎఫెక్ట్స్ కు చాలా ప్రాధాన్యం ఉంటుందనీ చెప్పారు. ఇండియాలో ఇంతవరకూ ఈ తరహా చిత్రం రాలేదని దర్శకుడు తెలిపారు. నెలాఖరు వరకూ తొలి షెడ్యూల్ జరుపుతామనీ, ఏప్రిల్ రెండోవారం నుంచి పూర్తయ్యే వరకూ మరో షెడ్యూల్ ఉంటుందనీ చిత్ర సమర్పకుడు శ్రీనివాసరావు తెలిపారు. తనీష్ మాట్లాడుతూ, ఈ చిత్రంతో తొలిసారి బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నట్టు తెలిపారు. ఇతర భాషల్లో నటించిన తమకు తెలుగులో ఇది తొలి చిత్రమని నటీమణులు దిశ, అశ్విత పేర్కొన్నారు. పాత, కొత్త తారళ సమ్మేళనంతో రూపొందుతున్న ఈ చిత్రానికి ఎస్.సంతోష్ సినిమాటోగ్రఫీ, చక్రి సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|