'నిత్యపెళ్లికొడుకు' పోసాని
పెళ్లంటే రెండు శరీరాల కలయిక కాదనీ రెండు మనసుల కలయిక అని చెప్పే పాయింట్ తో రూపొందుతున్న చిత్రం 'నిత్యపెళ్లికొడుకు'. పోసాని కృష్ణమురళి కథానాయకుడు. గౌరీపండిట్ కథానాయిక. సెవన్ హిల్స్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై జి.వి.సుబ్బయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి అళహరి దర్శకుడు. బంజారాహిల్స్ లోని ఓ గెస్ట్ హౌస్ లో ఈ చిత్రం షూటింగ్ ఉగాది రోజు ప్రారంభమైంది. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి సోమా విజయప్రకాష్ క్లాప్ ఇవ్వగా, సి.కల్యాణ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. వి.సాగర్ గౌరవ దర్శకత్వం వహించారు.
పోసాని మాట్లాడుతూ, సినిమాలను జడ్జిమెంట్ చేయడం చాలా కష్టమనీ, అయితే ఈ కథ చాలా బాగుందనీ చెప్పారు. బిజినెస్ పరంగా కూడా తన మీద ఎంత మార్కెట్ అవుతుందో అంతే బడ్జెట్ తో చేస్తున్న చిత్రమిదని చెప్పారు. పోసానికి అన్నివిధాలా సరిపోయే సబ్జెక్ట్ ఇదనీ, రెగ్యులర్ షూటింగ్ తో టాకీ పార్ట్ పూర్తి చేస్తామని దర్శకుడు తెలిపారు. పెళ్లికి ముందు అమ్మాయిని ఎంపిక చేసుకునేందుకు అందం, గుణంలో దేనికి ప్రాధాన్యం ఇస్తారనేది ఇందులో చర్చిస్తామని రచయిత దీపికారాజు తెలిపారు. సంగీతానికి మంచి ప్రాధాన్యం ఉన్న చిత్రమని చిత్ర సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ అన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో రఘనాథరెడ్డి, మా పృధ్వీ, కిషోర్ దాస్, మాడా, కల్పన, సోమా విజయప్రకాష్ తదితరులు నటించనున్నారు. దీపికారాజు-శైలుకుమార్ మాటలు, గాదిరాజు శ్రీను సినిమాటోగ్రఫీ, సాయిశ్రీనివాస్ ఎడిటింగ్ అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|