ఆర్య-త్రిష జంటగా 'సర్వం'
తమిళ చిత్రం 'సర్వం' ఇప్పుడు అదే పేరుతో తెలుగులోకి అనువాదమవుతోంది. ఆర్య, త్రిష, జె.డి.చక్రవర్తి ప్రధాన తారాగణం. గత ఏడాది 'అనంతపురం-1980' చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన సింహపురి టాకీస్ అధినేత ఎం.రఘనాథ్ ఈ చిత్రాన్ని అందిస్తున్నారు. విష్ణువర్దన్ దర్శకుడు.
చిత్ర విశేషాలను రఘనాథ్ తెలియజేస్తూ, ఇది ముక్కోణపు ప్రేమకథ అనీ, తమిళంలో చక్కటి ప్రేక్షకాదరణ చూరగొందనీ చెప్పారు. ఇటీవల వచ్చిన చిత్రాల్లో ఇదొక మంచి లవ్ ఎంటర్ టైనర్ అవుతుందన్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన పాటలు తమిళంలో బాగా పాపులర్ అయ్యాయని అన్నారు. ఈ నెలలోనే ఆడియో, ఏప్రిల్ లో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు. ఈ చిత్రానికి శశాంక్ వెన్నెలకంటి మాటలు, వెన్నెలకంటి-భువన చంద్ర పాటలు, త్యాగరాజన్ ఫైట్స్, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ అందించారు.
Be first to comment on this News / Article!
|