పాలకొల్లులో 'బావ'
బావలను ఆటపట్టించడం మరదళ్ల హక్కు. మరదళ్ల చలాకీతనం, చిలిపితనాన్ని తలుచుకుని మురిసిపోవడం బావల వంతు. అందులోనూ పల్లె వాతావరణం. వెరసి బావామరదళ్ల ముచ్చట్లు తెలుసుకోవాలంటే 'బావ' సినిమా చూడాల్సిందేనని అంటున్నాడు ఆ చిత్ర కథానాయకుడు సిద్దార్ధ. ఇందులో సిద్దార్ధకు జోడిగా ప్రణీత, సిద్దార్ధ తండ్రిగా రాజేంద్రప్రసాద్ నటిస్తున్నారు. శ్రీ కీర్తి కంబైన్స్ పతాకంపై ఎం.ఎల్.పద్మకుమార్ చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాంబాబు దర్శకుడు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రోగ్రస్ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జరుగుతోంది.
దర్శకుడు రాంబాబు మాట్లాడుతూ, అందమైన పల్లెటూరిలో బావామరదళ్ల మధ్య జరిగే క్యూట్ లవ్ స్టోరీ ఇదనీ, సిద్దార్ధ కొంటెతనం, చలాకితనం చిలిపి కృష్ణుడులా వినోదంతో కడుపుబ్బ నవ్విస్తుందని చెప్పారు. రాజేంద్ర ప్రసాద్ పాత్ర సినిమాకి కీలకమనీ, వీరిద్దరి మధ్యా సాగే సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయనీ తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ, తూర్పు గోదావరి జిల్లా రాజోలు, పరిసర గ్రామాల్లో ఫిబ్రవరిలో తొలి షెడ్యూల్ చేశామనీ, సిద్దార్ధ, ప్రణీత, రాజేంద్రపార్సాద్, ఆహుతి ప్రసాద్, జోగి నాయుడు తదితరులపై కీలక సన్నివేశాలు చిత్రీకరించామనీ చెప్పారు. రెండో షెడ్యూల్ ఈనెల 15 నుంచి పాలకొల్లు, పరిసర ప్రాంతాల్లో జరుగుతోందని తెలిపారు. ఏప్రిల్ 4 వరకూ ఈ షెడ్యూల్ ఉంటుందని చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో బ్రహ్మానందం, ఆలీ, రఘబాబు, రజిత, పవిత్రా లోకేష్, వినయ్ ప్రసాద్ తదితరులు నటిస్తున్నారు. చింతపల్లి రమణ మాటలు, అరవింద్ కృష్ణ సినిమాటోగ్రఫీ, గౌతంరాజు ఎడిటింగ్, చక్రి సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|