కేరళలో కె.విశ్వనాథ్ చిత్రం
కళాతపస్వి కె.విశ్వనాథ్ చాలా గ్యాప్ తర్వాత అల్లరి నరేష్, మంజరి జంటగా నటిస్తున్న ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ శ్రీ రాజరాజేశ్వరి ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై చెరుకూరి కౌసలేంద్రరావు ఆశీస్సులతో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. రెండో షెడ్యూల్ లో భాగంగా ప్రస్తుతం కేరళలో షూటింగ్ జరుగుతోంది. 'మౌనమే చెబుతోంది...ఏమాట...నీ మాటున దాగుందో...' అనే పల్లివితో సాగే పాటను హీరో హీరోయిన్లపై విశ్వనాథ్ చిత్రీకరిస్తున్నారు. దీనికి అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించగా, మణిశర్మ స్వరకల్పన చేశారు.
కేరళలోని అలెప్పీ పరిసరాల్లో షూటింగ్ చేస్తున్నామనీ, ఈ పాటతో పాటు మరో ఫ్యామిలీ సాంగ్, హీరోయిన్ ఇంటికి చెందిన సన్నివేశాల చిత్రీకరణ ఈనెల 18వరకూ ఉంటుందనీ నిర్మాతల్లో ఒకరైన హరిగోపాలకృష్ణమూర్తి తెలిపారు. ఇది విశ్వనాథ్ మార్క్ చిత్రమని తెలిపారు. ఇందులో సందేశం అంతర్లీనంగా ఉంటుందని విశ్వనాథ్ తెలిపారు. హైద్రాబాద్, అన్నవరం, గుంటూరులో తొలి షెడ్యూల్ జరిపామని చెప్పారు.సంగీత, సాహిత్యాలకు మంచి ప్రాధాన్యం ఉటుందనీ, మణిశర్మ సంగీతం, వేణుగోపాల్ ఛాయాగ్రహణం ఎంటగానో ఆకట్టుకుంటాయనీ తెలిపారు. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ చిత్రంలో శరత్ బాబు, ధర్మవరపు, వైజాగ్ ప్రసాద్, అశోక్ కుమార్, రాళ్లపల్లి, గీతాంజలి, జయలక్ష్మి, జెన్నీ తదితరులు నటిస్తున్నారు. కథ-స్క్రీన్ ప్లే సైతం విశ్వనాథ్ అందిస్తున్న ఈ చిత్రానికి టి.సాయినాథ్ రచనా సహకారం, ఎం.వి.ఎస్.హరనాథరావు మాటలు, సిరివెన్నెల-అనంత్ శ్రీరామ్-రాంభట్ల పాటలు అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|