నా పొట్ట కొట్టొద్దు : శివాజీ
పైరసీ భూతం సినీ పరిశ్రమను బెంబేలెత్తిస్తోంది. హీరోగా పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన శివాజీ ఇప్పుడు నిర్మాతగా కూడా మారి తొలి ప్రయత్నంగా 'తాజ్ మహల్' చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా తన పన్నెండేళ్ల కష్టమనీ, తన కష్టమంతా ధారపోసి ఈ చిత్రాన్ని నిర్మించాననీ శివాజీ తెలిపారు. దయచేసి సినిమాను ఎవరూ పైరసీ చేయవద్దనీ, అలా చేస్తే ఎన్నో కుటుంబాలు వీధిన పడతాయని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈనెల 20న 'తాజ్ మహల్' విడుదలవుతున్న తరుణంలో శివాజీ తన మనసులోని మాటను చెప్పుకొచ్చారు.
'తాజ్ మహల్ కథపై ఉన్న నమ్మకంతోనే నిర్మాతగా మారి సినిమా తీసాను. ఇది చాలా గొప్ప ప్రేమకథ. ప్రతి ఒక్కరూ ఇది తమ కథగానే భావిస్తారు. అంతటి గొప్పతనం ఇందులో ఉంది. కన్నడంలో రెండు వందల రోజులకు పైగా సినిమా ఆడింది. సినిమా విడుదలవుతోదంటే నేను పడిన కష్టం గుర్తుకొస్తోంది. నా పన్నిండేళ్ల కష్టం ఈ సినిమా. రోజూ పద్దెనిమిది గంటలు శ్రమించి సినిమా నిర్మించాను. దయచేసి ఈ సినిమాను పైరసీ చేయకండి. అలా చేసిన వాళ్లకు బహుశా ఓ లక్ష రూపాయల లాభం వస్తుందేమో. ఆ లక్ష ఇవ్వడానికి కూడా సిద్ధంగానే ఉన్నా. పైరసీ మాత్రం చేయొద్దు. నేను ఒక సినిమా చేస్తే 200 కుటుంబాలు అన్నం తింటాయి. మీరు పైరసీ చేస్తే ఆ కుటుంబాలన్నీ రోడ్డున పడతాయి. ప్లీజ్ ఆలోచించండి. సహకరించండి' అని పైరసీకారులకు శివాజీ విజ్ఞ్తప్తి చేశారు. శివాజీ ఆశించినట్టే సినిమా మంచి సక్సెస్ సాధించి..పైరసీ బారిన పడదనే ఆశిద్దాం.
Be first to comment on this News / Article!
|