రవితేజతో 'లీడర్' రిచా...
శేఖర్ కమ్ముల 'లీడర్' చిత్రంతో పరిచయం చేసిన బెంగాలీ బ్యూటీ రిచా గంగోపాధ్యాయ్ తెలుగులో మరో మంచి అవకాశం అందిపుచ్చుకున్నట్టు తెలిసింది. క్రేజీ హీరో రవితేజకు జోడిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో హీరోయిన్ గా ఆమె ఎంపికైనట్టు సమాచారం. ఈ చిత్రాన్ని ఎల్లో ఫ్లవర్స్ పతాకంపై రమేష్ పుప్పాల నిర్మించనున్నారు. దీనికి 'రొమాంటిక్ రిషి', 'మిరపకాయ- వీడు చాలా హాట్ గురూ' అనే టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి.
రవితేజను దృష్టిలో పెట్టుకుని ఓ అద్భుతమైన కథను హరీష్ శంకర్ రెడీ చేశారనీ, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ ఎత్తున అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని నిర్మించనున్నామనీ రమేష్ పుప్పాల చెబుతున్నారు. ఈనెల 25న ఈ కొత్త చిత్రం సెట్స్ పైకి రాబోతోంది. రవితేజ ప్రస్తుతం గోపి దర్శకత్వంలో వెంకట్ నిర్మిస్తున్న 'డాన్ శీను'లో నటిస్తుండగా, రమేష్ వర్మ ('రైడ్' ఫేమ్) దర్శకత్వంలో 'వీర' చిత్రానికి కూడా కమిట్ అయ్యారు.
Be first to comment on this News / Article!
|