8 ట్రూ లవ్ స్టోరీస్...
కొత్త కాన్సెప్ట్...8 కథలు...ఎనిమిది మంది డైరెక్టర్లతో ఓ చిత్రం రూపొందనుది. ఆర్టిస్టులు, డైరెక్టర్ల వివరాలు గుట్టుగా ఉంచుతున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవం హైద్రాబాద్ లోని ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ లో బుధవారం ఉదయం జరిగింది. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తం సన్నివేశానికి మంత్రి డి.కె.అరుణ్ క్లాప్ ఇచ్చారు. ఎమ్మెల్యే పి.నరసారెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు.
చిత్ర నిర్మాత జలంధర్ రెడ్డి మాట్లాడుతూ, తెలుగు సినిమా చరిత్రలో ఇదొక కొత్త ప్రయోగమనీ, ఒక్కో స్టోరీ ఒక్కేలా ఉంటూ ప్రేక్షకులను అలరించే విధంగా సినిమా ఉంటుందనీ చెప్పారు. ఇందులో ఐదుగురు హీరోలు, 11 మంది హీరోయిన్లు ఉంటారనీ, 100 రోజుల్లో సినిమా పూర్తి చేస్తామనీ చెప్పారు.
Be first to comment on this News / Article!
|