కొత్తజంటతో 'స్వర్ణమంజలి'
విష్ణు, అమృతవల్లి జంటగా శ్రీరంగ సమర్పణలో శ్రీశ్రీ కుమార స్వామి ఫిలింస్ బ్యానర్ లో జె.కుమార స్వామిరెడ్డి నిర్మిస్తున్న కొత్త చిత్రం 'స్వర్ణమంజలి'. ఇంద్ర దర్శకుడు. అన్నపూర్ణ స్టూడియోస్ లో బుధవారం ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి వి.సముద్ర క్లాప్ ఇవ్వగా, కెమెరామన్ శ్రీనివాసరెడ్డి స్విచ్చాన్ చేశారు. వి.సాగర్ గౌరవ దర్శకత్వం వహించారు.
దర్శకుడు ఇంద్ర మాట్లాడుతూ, వైవిధ్యమైన కథాంశంతో కూడిన చిత్రమిదనీ, ఉయ్యూరులో శుక్రవారం నుంచి షూటింగ్ ప్రారంభమవుతుందనీ చెప్పారు. ఇందులో కిరణ్ రాథోడ్ ఓ ఐటెం సాంగ్ చేయనుందని తెలిపారు. వివిధ సీరియల్స్ లో నటించిన తనకు హీరోగా ఇది తొలి చిత్రమని విష్ణు తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో భానుప్రియ, రమాప్రభ, రామిరెడ్డి, చలపతిరావు, ఎమ్మెస్ నారాయణ, కొండవలస, చిట్టిబాబు, అంత్ తదితరులు నటిస్తున్నారు. అప్పాజీ కథ-మాటలు, జయసూర్య-ఘనశ్యామ్ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|