'యంగ్ ఇండియా'లో రీమిక్స్
దర్శకరత్న దాసరి నారాయణరావు అంతా కొత్త వారితో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'యంగ్ ఇండియా'. దర్శకుడిగా దాసరి 149వ చిత్రమిది. దాసరి పద్మ సమర్పణలో రామకృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ చిత్రం కోసం ఓ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. దాసరి దర్శకత్వంలోనే ఒకప్పుడు విజయవంతమైన 'ప్రేమాభిషేకం' చిత్రంలోని 'వందనం అభివందనం' అనే పాటకు రీమిక్స్ గా దీనిని చిత్రీకరిస్తున్నారు. ఆసక్తికరంగా ఈ పాటకు దాసరి నారాయణరావు స్వయంగా కొరియోగ్రఫీ అందిస్తున్నారు.
గురువుగారు దాసరి తీసిన 'ప్రేమాభిషేకం' అప్పట్లో మ్యూజికల్ గా కూడా ఎంతో పెద్ద హిట్టయిందనీ, అందులోని 'వందనం అభినందనం' పాటను 'యంగ్ ఇండియా'లో రీమిక్స్ చేస్తున్నామనీ, బుధవారం నుంచి సాంగ్ చిత్రీకరణ జరుగుతోందనీ రామకృష్ణప్రసాద్ తెలిపారు. దీని తర్వాత మరో పాటను కూడా ఇక్కడే చిత్రీకరిస్తామనీ, దీంతో షూటింగ్ దాదాపు పూర్తవుతుందని ఆయన చెప్పారు. మరోవైపు ప్రసాద్ ల్యాబ్స్ లో రీరికార్డింగ్, రామానాయుడు స్టూడియోస్ లో డబ్బింగ్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని తెలిపారు. సమ్మర్ కానుకగా ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది.
Be first to comment on this News / Article!
|