'బొమ్మరిల్లు' చిత్రంలో హాసినిగా యువ హృదయాలను దోచుకున్న జెనీలియా ప్రస్తుతం హిందీలో బిజీగా ఉన్నప్పటికీ తెలుగులోనూ మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. ప్రస్తుతం రామ్ చరణ్ సరసన కథానాయికగా 'ఆరంజ్' చిత్రంలో నటిస్తోంది. తాజాగా హీరో రామ్ సరసన నటించే అవకాశాన్ని కూడా దక్కించుకున్నట్టు సమాచారం. 'రెడీ' వంటి హిట్ చిత్రం తర్వాత ఈ ఇద్దరూ కలిసినటించనున్న రెండో చిత్రం ఇదే కానుంది. దీనిని స్రవంతి ఆర్ట్స్ పతాకంపై స్రవంతి రవికిషోర్ నిర్మించబోతున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. ఆసక్తికరంగా ఈ చిత్రంలో తెలుత హీరోయిన్ గా ఇలియానాను అనుకున్నారు.
స్క్రిప్టు పరంగా సురేందర్ రెడ్డి కొన్ని మార్పులు చేర్పులు చేయడంతో పాత్ర పరంగా హీరోయిన్ గా జెనీలియా అయితేనే కరెక్ట్ గా ఉంటుందని దర్శకనిర్మాతల భావించినట్టు తెలుస్తోంది. దీంతో ఇలియానా ప్లేస్ లో జెనీలియాను ఎంపిక చేసినట్టు చెబుతున్నారు. రామ్ కెరీర్ లోనే ఇది బిగ్ బడ్జెట్ చిత్రమవుతుందనీ, ఏప్రిల్ లో షూటింగ్ ప్రారంభించి ఏడాది చివరి నాటికి షూటింగ్ పూర్తి చేయబోతున్నారు. రామ్ ప్రస్తుతం దిల్ రాజు నిర్మిస్తున్న 'రామ రామ కృష్ణ కృష్ణ' చిత్రంలో నటిస్తున్నారు.