ఒకరోజు లేటుగా 'యాగం'
పైరసీకి వ్యతిరేకంగా తెలుగు సినీ పరిశ్రమ శుక్రవారంనాడు బంద్ ప్రకటించడంతో ఆ రోజు విడుదల కావలసిన 'యాగం' చిత్రం 20న విడుద కానుంది. నవదీప్, భూమిక, కిమ్ శర్మ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ చిత్రానికి పి.ఎ.అరుణ్ ప్రసాద్ దర్శకుడు. నటి భూమికకు చెందిన డౌన్ టౌన్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పణలో సిల్వర్ స్క్రీన్ మూవీస్ బ్యానర్ పై రాజు, ప్రవీణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ముందుగా అనుకున్న ప్రకారం కాకుండా మరుసటి రోజు సినిమా విడుదలవుతున్న విషయాన్ని హైద్రాబాద్ లో గురువారంనాడు ఏర్పాటు చేసిన సమావేశంలో భూమిక, నవదీప్ తెలిపారు.
నవదీప్ మాట్లాడుతూ, 'గౌతమ్ ఎస్.ఎస్.సి.' వంటి విలక్షణ చిత్రాన్ని తీసిన అరుణ్ ప్రసాద్ ఈ చిత్రాన్ని కూడా వినూత్నంగా తెరకెక్కించారనీ, 90 శాతం షూటింగ్ బ్యాంకాక్ లో జరిపామనీ చెప్పారు. ఇందులో తాను బార్ టెండర్ గా నటించగా, భూమిక ఎయిర్ హోస్టెస్ గా, బార్ లో తన కొలీగ్ గా కిమ్ శర్మ నటించినట్టు తెలిపారు. తొలుత ఈనెల 19న సినిమా విడుదల చేయాలని అనుకున్నప్పటికీ పరిశ్రమ బంద్ కారణంగా 20న రిలీజ్ అవుతుందని చెప్పారు. ఇదొక వెరైటీ చిత్రమనీ, పదేళ్లుగా తాను తెలుగు పరిశ్రమలో ఉంటూ సంపాదించుకున్నాననీ, అదే కారణంలో తెలుగులో ఈ సినిమాను తాను నిర్మించినట్టు తెలిపారు. నిర్మాతగా తనకు ఈ చిత్రం సంతృప్తి నిచ్చిందనీ, ఏడాదికి ఒక రెండు చిత్రాలు తెలుగులో నిర్మిస్తుంటాననీ చెప్పారు. తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరిస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
Be first to comment on this News / Article!
|