సుశాంత్ పుట్టినరోజు
'కాళిదాసు', 'కరెంట్' చిత్రాల కథానాయకుడు సుశాంత్ పుట్టినరోజు వేడుక అన్నపూర్ణ స్టూడియోస్ లో అక్కినేని అభిమానుల సమక్షంలో గురువారం సందడిగా జరిగింది. సుశాంత్ తల్లి నాగ సుశీల, తాత అక్కినేని నాగేశ్వరరావు, నిర్మాత చింతలపూడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుశాంత్ కేక్ కట్ చేసి తన ఆనందాన్ని అందరితో పంచుకున్నారు. తన తదుపరి ప్రాజెక్ట్ ను కూడా ప్రకటించారు.
సుశాంత్ మాట్లాడుతూ, అక్కినేని ఫ్యామిలీ అభిమానుల సమక్షంలో పుట్టినరోజు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందనీ, తన తదుపరి చిత్రం జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఉండబోతోందనీ చెప్పారు. ఈ చిత్రాన్ని తన తల్లి నాగసుశీల, చింతలపూడి శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారని తెలిపారు. ఇదొక ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అనీ, ప్రకాష్ రాజ్ ఓ కీలక పాత్ర పోషించనున్నారనీ చెప్పారు. కరెంట్ చిత్రం తర్వాత చాలా ఆఫర్లు వచ్చినప్పటికీ మంచి కథ కోసం వేచిచూశాననీ, నాగేశ్వరరెడ్డి అలాంటి స్క్రిప్టుతో రావడంతో వెంటనే ఒప్పుకున్నాననీ చెప్పారు. అక్కినేని నాగేశ్వరరావు మాట్లాడుతూ, తాను వైజాగ్ లో షూటింగ్ లో ఉన్నప్పుడు సుశాంత్ అమెరికాలో పుట్టిన వార్త తెలిసి కేక్ కట్ చేసి అందరికీ చాక్లెట్లు పంచాననీ చెప్పారు. సహజంగా సుశాంత్ తన పుట్టినరోజు ఇంట్లోనే జరుపుకొంటాడనీ, అయితే హీరో అయిన తర్వాత నుంచి అన్నపూర్ణ స్టూడియోలో అభిమానుల మధ్య చేసుకుంటున్నాడనీ అన్నారు. ప్రతి పుట్టినరోజుకు తన మనవళ్లను ఆదిరిస్తున్న అభిమానులకు కృతజ్ఞతలని అన్నారు. మా కథానాయకుడు సుశాంత్ కు పుట్టినరోజు శుభాకాంక్షలని చింతలపూడి శ్రీనివాసరావు పేర్కొన్నారు. సుశాంత్ తో జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా నిర్మిస్తున్నామనీ, అలాగే నాగార్జునతో మరో సినిమా ఉంటుందని చెప్పారు. తమ్ముడు నాగార్జునతో చాలా కాలంగా సినిమా తీయాలనే కోరిక త్వరలో తీరనుందని నాగసుశీల అన్నారు. సుశాంత్ హీరోగా తాము నిర్మిస్తున్న చిత్రం ఏప్రిల్ నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు.
Be first to comment on this News / Article!
|