'యాగం' యథాప్రకారం రిలీజ్
నవదీప్, భూమిక, కిమ్ శర్మ ప్రధాన పాత్రల్లో రూపొందిన 'యాగం' చిత్రం ముందుగా అనుకున్న ప్రకారం ఈ శుక్రవారం థియేటర్ల ముందుకు వచ్చింది. తొలుత వీడియో పైరసీకి నిరసనగా టాలీవుడ్ శుక్రవారం బంద్ ప్రకటించడంతో ఈ సినిమా రీలీజ్ ఒకరోజు వాయిదా వేయాలని అనుకున్నారు. అయితే మంత్రి గీతారెడ్డిని సినీ ప్రముఖులు గురువారం కలిసిన తర్వాత బంద్ ఆలోచనను విరమించుకున్నారు. దీంతో 'యాగం' యథాప్రకారం శుక్రవారం విడుదలకు మార్గం సుగమమైంది. అరుణ్ ప్రసాద్ ('గౌతమ్ ఎస్ఎస్ సి' ఫేమ్) దర్శకుడిగా డౌన్ టౌన్ ఫిల్మ్ ఫ్రైవేట్ లిమిటెడ్ సమర్పణలో సిల్వర్ స్క్రీన్ మూవీస్ బ్యానర్ పై రాజు, ప్రవీణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
కథానుగుణంగా చిత్రంలోని 90 శాతం షూటింగ్ బ్యాంకాక్ లో జరిపారు. బ్యాంకాక్ లో బార్ ఉద్యోగిగా నవదీప్, ఎయిర్ హోస్టెస్ గా భూమిక, బార్ లో పనిచేసే మరో అమ్మాయిగా కిమ్ శర్మ నటించారు. భూమిక డౌన్ టౌన్ ఫిల్మ్ ఫ్రైవేట్ లిమిటెడ్ ద్వారా తొలిసారి నిర్మాణరంగంలోకి అడుగుపెట్టి ఈ చిత్రాన్ని తీయడం విశేషం.
Be first to comment on this News / Article!
|