మోహన్ బాబు బర్త్ డే
ప్రముఖ నటుడు, నిర్మాత మోహన్ బాబు శుక్రవారంనాడు మరో వసంతంలోకి అడుగుపెట్టారు. తిరుపతిలోని ఆయన సొంత విద్యాసంస్థ అయిన శ్రీ విద్యానికేతన్ లో విద్యార్థులు, అభిమానుల సమక్షంలో పుట్టినరోజు వేడుకను జరుపుకొన్నారు. మోహన్ బాబు జన్మదినం మాత్రమే కాకుండా విద్యా నికేతన్ సంస్థ స్థాపించిన రోజు కూడా కావడంతో ఆనవాయితీగా మోహన్ బాబు ఈ రెండు వేడుకలను కన్నులపండువగా జరిపారు.
విద్యానికేతన్ లోని పదివేల మందికి పైగా విద్యార్థులతో పాటు అభిమానులు, చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలతో కలిసి ఏటా 30వేల మంది వస్తుంటారనీ, అందుకోసం 18, 19 తేదీల్లో రెండు రోజుల పాటు ఈ వేడుకలు నిర్వహిస్తున్నామనీ మోహన్ బాబు తెలిపారు. ఆ భగవంతునికి, తనను ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికీ తన కృతజ్ఞతలని అన్నారు. అందరూ కలిసి ఉండాలన్నదే తన అభిమతమని పేర్కొన్నారు. మోహన్ బాబు బర్త్ డే వేడుకలో ఆయన సతీమణి, కుమారుడు విష్ణు, ముఖ్య అతిథిగా కె.రాఘవేంద్రరావు పాల్గొన్నారు. అనంతరం మోహన్ బాబు దంపతులు రక్తదానం చేశారు. నటుడిగా 500కు పైగా చిత్రాల్లో నటించి నిర్మాతగా శ్రీ లక్ష్మీప్రసన్న బ్యానర్ పై 50 చిత్రాలు నిర్మించిన మోహన్ బాబుకు భారత ప్రభుత్వం 'పద్మశ్రీ'తో గౌరవించింది.
Be first to comment on this News / Article!
|