గౌండమణి క్షేమం...
తమిళంలో ప్రముఖ కమెడియన్ గా 1970 నుంచి 2000 వరకూ తనకు తిరుగులేదని అనిపించుకున్న గౌండమణి గురువారంనాడు మరణించినట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదని తేలింది. రెండ్రోజుల క్రితం ఆయనకు శ్వాస సంబంధమైన సమస్యలు తలెత్తడంతో హుటాహుటిని చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. తీవ్రమైన గుండెపోటుతో ఆయన కన్నుమూసినట్టు ఇంటర్నెట్ లో వార్తలు రావడంతో ఒక్కసారిగా ఆయన అభిమానులు ఉలిక్కిపడ్డారు. దీనిపై నిజానిజాల నిర్దారణకు పత్రికా కార్యాలయాలకు, గౌండమణి సంబంధీకులకు ఫోన్లు వెల్లువెత్తాయి. అయితే ఆయన మరణించారనే వార్తలు కేవలం వదంతులేననీ, ప్రస్తుతం ఆయన పూర్తిగా కోలుకున్నారనీ శుక్రవారంనాడు నిర్దారణ అయింది. గౌండమణి మరణించినట్టు వికీ పేజ్ లో బయట నుంచి పోస్ట్ చేసిన ఓ వార్తను కూడా ఆ తదుపరి తొలగించారు.
Be first to comment on this News / Article!
|