అక్కినేని-శ్రీహరి-సాయిరాం
ఆరోప్రాణం, పవిత్ర ప్రేమ, క్రిష్ణబాబు, తిరుమల తిరుపతి వెంకటేశ, అల్లరి రాముడు, అడవి రాముడు, ఒక ఊరిలో వంటి చిత్రాలు నిర్మించిన ఫ్రెండ్లీ మూవీస్ అధినేత చంటి అడ్డాల తాజాగా ఓ భారీ చిత్రాన్ని నిర్మించనున్నారు. డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు, రియల్ స్టార్ శ్రీహరి, 'బంపర్ ఆఫర్' హీరో సాయిరాం శంకర్ ప్రధాన పాత్రలు పోషించనున్నారు.
ఈ చిత్రం గురించి సాయిరాం శంకర్ మాట్లాడుతూ, 'బంపర్ ఆఫర్' హిట్ తర్వాత హీరోగా చాలా ఆఫర్లు వచ్చినప్పటికీ అడ్డాల చంటి నిర్మిస్తున్న ఈ చిత్రం కథ ఎంతో నచ్చి పూర్తిగా దానిమీదే దృష్టి సారించానని చెప్పారు. స్టూడెంట్ నెంబర్ 1, నిన్నే పెళ్లాడతా వంటి సూపర్ హిట్ చిత్రాలకు కథ అందించిన పృధ్వితేజ్ ఈ చిత్రానికి అద్భుతమైన కథ రెడీ చేశారనీ, సూపర్ రైటర్స్ పరుచూరి బ్రదర్స్ గత ఆర్నెల్లుగా ఈ కథ మీద వర్క్ చేసి చక్కటి డైలాగ్స్ రాశారనీ తెలిపారు. సీనియర్ మోస్ట్ కెమెరామన్ ఎస్.గోపాలరెడ్డి ఈ చిత్రానికి ఛాయాగ్రహణం అందిస్తుండటం విశేషమన్నారు. చక్రి సూపర్ హిట్ మ్యూజిక్ ఇవ్వనున్నారనీ, ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయనీ తెలిపారు. కథలో అత్యంత కీలకమైన పాత్రలో మహానటులు అక్కినేని నటిస్తున్నారనీ, మరో ముఖ్యపాత్ర శ్రీహరి చేస్తున్నారనీ తెలిపారు. ఇక బంపర్ ఆఫర్ తర్వాత తన ఇమేజ్ ను మరింత పెంచే విధంగా ఇందులోని తన పాత్ర ఉంటుందనీ, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, ఆలీ, ఎంఎస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి, రఘుబాబు, కృష్ణ భగవాన్, వేణుమాధవ్ వంటి ప్రముఖ తారాగణం నటిస్తున్నారని చెప్పారు. ఈ చిత్రాన్ని ఎలాగైనా పెద్ద హిట్ చేయాలనే పట్టుదలతో అడ్డాల చంటి ఉన్నారనీ, ఏప్రిల్ లో నాన్ స్టాప్ గా షూటింగ్ చేస్తామని అన్నారు. కన్యాకుమారి, చిదంబరం, కంచి, హైదరాబాద్ లలో షూటింగ్ జరుగుతుందన్నారు. హీరోయిన్ ఎంపిక జరుగుతోందని చెప్పారు. తన సోదరుడు పూరీ జగన్నాథ్ దగ్గర దర్శకత్వ శాఖలో అనుభవం సంపాదించిన అశోక్ కుమార్ లాలమ్ స్క్రీన్ ప్లే, దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుందని తెలిపారు.
Be first to comment on this News / Article!
|