శ్రీకాంత్ కొత్త రకం 'దొంగ'
దొంగ అనేది బాక్సాఫీస్ సక్సెస్ ఫార్ములా అనీ, అందరూ అగ్రతారలు దొంగగా నటించి విజయాన్ని దోచుకున్నారనీ, ఇప్పుడు శ్రీకాంత్ పోషించే దొంగ పాత్ర కూడా పూర్తి వైవిధ్యంగా ఉంటుందనీ అంటున్నారు దర్శకుడు సుధాకర్ నాయుడు (జీవి). ఆయన దర్శకత్వంలో శ్రీకాంత్ కథానాయకుడుగా 'రంగ ది దొంగ' రూపొందుతోంది. సి.ఆర్.మనోహర్ నాయుడు ('మహాత్మ' ఫేమ్), సుధాకర్ నాయుడు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
శ్రీకాంత్ నటిస్తున్న దొంగ పాత్ర ఇంతవరకూ తనకు తెలిసి ఎవరూ చేయలేదనీ, చాలా కొత్త ఒరవడిలో ఆయన పాత్ర ఉంటుందనీ దర్శకుడు వివరిచారు. విమాలారామన్ ఇందులో పోలీసు అధికారిణిగా నటిస్తోందనీ, ఆ పాత్ర తీరుతెన్నులు చాలా వినోదాత్మకంగా ఉంటుందనీ చెప్పారు. సంగీతానికి మంచి ప్రాధాన్యం ఉందనీ, చక్రి ఎక్స్ టార్డినర్ మ్యూజిక్ ఇస్తున్నారనీ తెలిపారు. మహాత్మ చిత్రం తర్వాత సి.ఆర్.మనోహర్ తన దర్శకత్వంలో ఈ సినిమా చేస్తుండటం చాలా సంతోషంగా ఉందనీ, ఆయన చాలా మంచి నిర్మాత అనీ అన్నారు. సి.ఆర్.మనోహర్ మాట్లాడుతూ, ఈనెల 17తో తొలి షెడ్యూల్ పూర్తయిందనీ, 18 రోజుల పాటు జరిపిన ఈ షెడ్యూల్ లో రోజూ 150 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్నారనీ, అంత భారీ ఎత్తున తొలి షెడ్యూల్ చేశామనీ చెప్పారు. శ్రీకాంత్, భువనేశ్వరి, జ్యోతి తదితరులపై ఓ పాట చిత్రీకరించామనీ, అలాగే ఒక ఫైట్, ఇంటర్వెల్ ఎపిసోడ్, 20 సన్నివేశాలు తీశామని తెలిపారు. రెండో షెడ్యూల్ ఏప్రిల్ 5 నుంచి 25 వరకూ హైద్రాబాద్ లో చేస్తామని చెప్పారు. మహాత్మ తర్వాత మళ్లీ వెంటనే శ్రీకాంత్ తో సినిమా చేయడం, అది కూడా తనకు మంచి మిత్రుడైన జీవి దర్శకత్వంలో చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో జయప్రకాష్ రెడ్డి, తెలంగాణ శకుంతల, శివాజీరాజా తదితరులు నటిస్తున్నారు. పూర్ణ కాండ్రు సినిమాటోగ్రఫీ, గణేశ్ ఫైట్స్, గౌతంరాజు ఎడిటింగ్ అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|