'రామ రామ కృష్ణ కృష్ణ' లోగో
రామ్ కథానాయకుడుగా శ్రీవాస్ ('లక్ష్యం' ఫేమ్) దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం 'రామ రామ కృష్ణ కృష్ణ'. యాక్షన్ కింగ్ అర్జున్ ఓ పవర్ ఫుల్ పాత్ర పోషిస్తుండగా, ప్రియా ఆనంద్, బింధు మాధవి హీరోయిన్లు. ఈ చిత్రం లోగో ఆవిష్కరణ హైద్రాబాద్ లో జరిగింది. హీరోహీరోయిన్లతో పాటు దీల్ రాజు, శ్రీవాస్, యూనిట్ సభ్యుల చేతుల మీదుగా ఈ ఆవిష్కరణ జరిగింది.
దిల్ రాజు మాట్లాడుతూ, శ్రీవాస్ 'లక్ష్యం' విడుదలై రెండేళ్లకు పైనే కావస్తోందనీ, ఆ సినిమా టైమ్ లోనే ఈ స్టోరీ లైన్ చెప్పడం, అందుకు తగ్గట్టుగానే చాలా కష్టపడి మంచి అవుట్ పుట్ ఇవ్వడం జరిగిందని అన్నారు. రామ్ కెరీర్ లో ఇదో బిగ్గెస్ట్ హిట్ ఫిల్మ్ అవుతుందనీ, అలాగే హీరో అర్జున్ ఇందులో కథకు వెన్నెముక లాంటి పాత్రను పోషించారనీ చెప్పారు. తొలిసారి తమ బ్యానర్ కు కీరవాణి సంగీతం అందించారనీ, తమ సంస్థలో వచ్చిన చిత్రాలన్నింటిలోనూ ఈ చిత్ర సంగీతం నెంబర్ వన్ అవుతుందనీ అన్నారు. వేసవి సెలవుల్లో సినిమా రిలీజ్ చేస్తామని తెలిపారు. రామ్ మాట్లాడుతూ, శ్రీవాస్ సినిమా చాలా బాగా తీశారని, దిల్ రాజు గురించి అందరికీ తెలిసిందేననీ అన్నారు. ఎం.రత్నం అద్భుతమైన సంభాషణలు అందించారనీ, గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి ఇది 200 చిత్రం కావడం విశేషమనీ అన్నారు. శ్రీవాస్ మాట్లాడుతూ, లక్ష్యం చిత్రం కంటే ఎక్కువ కష్టపడి ఈ సినిమా చేశాననీ, రెండో సినిమా మంచి కథ, దిల్ రాజు బ్యానర్ లో చేయాలనుకోవడం, అలాగే జరగడం ఆనందంగా ఉందన్నారు. హీరోకి రాము అనే పేరు పెట్టాలని అతని తల్లి, కృష్ణ అనే పేరు పెట్టాలని తండ్రి అనుకుంటారనీ, చివరకు రెండూ కలిపి రామకృష్ణ అనే పేరు పెడతారనీ, అలాగే అశోక్ దేవా అనే పవర్ ఫుల్ పాత్రలో అర్జున్ నటించారనీ చెప్పారు. ప్రియా ఆనంద్, బిందుమాధవి, ఎం.రత్నం తదితరులు ఈ సమావేశంలో మాట్లాడారు. సహ నిర్మాతలు శిరీష్, లక్ష్మణ్, కెమెరామన్ శేఖర్ వి జోసఫ్, ఎడిటర్ గౌతంరాజు, కళా దర్శకుడు ఎఎస్ ప్రకాష్, ఫైట్ మాస్టర్ విజయ్, గేయ రచయిత అనంత్ శ్రీరామ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|