ఆస్ట్రేలియాలో 'ఆరెంజ్'
రామ్ చరణ్ కథానాయకుడుగా 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై నాగబాబు నిర్మిస్తున్న 'ఆరంజ్' చిత్రం షూటింగ్ కొద్ది రోజులుగా ఆస్ట్రేలియాలో జరుపుకొంటోంది. పద్నాలుగు వారాల పాటు కీలకమైన షూటింగ్ ను అక్కడే ప్లాన్ చేశారు. ఆస్ట్రేలియా గత కొంత కాలంగా జాత్యహంకార కారణాలతో భారతీయుల మీద దాడులు జరుగుతున్న తరుణంలో 'ఆరెంజ్' టీమ్ అక్కడ షూటింగ్ జరుపుకోవడం విశేషం. అయితే ఆస్ట్రేలియాలో షూటింగ్ ఎంతో సౌకర్యవంతంగా ఉన్నట్టు చిత్ర దర్శక నిర్మాతలు, నటీనటులు తమ సంతోషాన్ని వ్యక్తం చేయడం విశేషం. ఆస్ట్రేలియా విద్యా శాఖ మంత్రి బ్రోన్ విన్ పికీ నేరుగా షూటింగ్ లొకేషన్ కు వెళ్లి యూనిట్ ను కలిసారు.
మంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ, అస్ట్రేలియాలో షూటింగ్ చేయడం సౌకర్య వంతంగా ఉందని యూనిట్ తనతో చెప్పడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. ఇక్కడ షూటింగ్ చేయడం బాగుందనే విషయాన్ని భారతీయ చలన చిత్ర పరిశ్రమకు చెప్పడం తమ వంతు బాధ్యతగా భావిస్తున్నట్టు చిత్ర యూనిట్ తనతో అన్నారనీ, భారతదేశానికి ఆస్ట్రేలియా వ్యతిరేకి కాదనీ మంత్రి తెలిపారు. కాగా, రామ్ చరణ్ లవర్ బాయ్ గా నటిస్తున్న ఈ చిత్రంలో జెనిలియా, షాజాన్ పదమ్సీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. హరిస్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|