'మదనుడు' మృగంగా మారితే..
'మన్మధుడు' వంటి సక్సెస్ ఫుల్ చిత్రాన్ని అందించిన యువ నిర్మాత సురేష్ చౌదరి సూర్య పవర్ ఫుల్ మూవీస్ పతాకంపై రూపొందిస్తున్న తదుపరి చిత్రం 'మదనుడు'. జో దర్శకుడు. ఆర్ముగమ్, స్వాతి రెహనా హీరో హీరోయిన్లు. వైవిధ్యమైన కథ, కథనాలతో రూపొందిన ఈ చిత్రం డబ్బింగ్, సాంగ్స్ రికార్డింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని తొలి కాపీకి సిద్ధమవుతుంది.
నిర్మాత సురేష్ చౌదరి మాట్లాడుతూ, ప్రేమ, స్నేహం, శీలం ఈ మూడు అంశాల చుట్టూ తిరిగే విభిన్న కథాంశంతో 'మదనుడు' చిత్రం రూపొందిందనీ, 'మదనుడు' మృగంగా మారితే జరిగే పరిణామాలు ఏమిటనేది ఈ చిత్రంలోని ప్రధానాంశమనీ తెలిపారు. ఈ చిత్రంలోని పాటలను వెన్నెలకంటి, పొందూరి, వెలిదండ్ల రాశారనీ, అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయనీ చెప్పారు. తొలి కాపీ సిద్ధం చేసి ఏప్రిల్ లో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని వెల్లడించారు. రచయిత రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, బాషకు వ్యాకరణం ఎంత అవసరమో జీవితానికి పరిధి అనేది అంత అవసరమనీ, ప్రేమకయినా, స్నేహానికైనా హద్దులు ఉండాలనీ అన్నారు. అలా కాని జీవితాల ముగింపు ఎలా ఉంటుందో తెలిపే చిత్రమే ఇదనీ, కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంటుందన్నారు. చిత్రంలోని క్లైమాక్స్ సన్నివేశాలు ఇంతవరకూ వెండితెరపై రాలేదనీ, పాత్రలే తప్ప పాత్రధారులు కనిపించనంత సహజంగా ఈ చిత్రం ఉంటుందనీ తెలిపారు. ఈ చిత్రానికి మధు ఎడిటింగ్ అందించారు.
Be first to comment on this News / Article!
|