లవ్ థ్రిల్లర్ 'ప్రేమ ఎక్స్ ప్రెస్'
అహద్ ఖాన్, ఆర్తి పురి, సబీనా ప్రధాన పాత్రధారులుగా నటించిన లవ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ 'ప్రేమ ఎక్స్ ప్రెస్'. సి.ఎస్.కుమార్ సమర్పణలో బ్లూ రే ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై కె.రాజేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జాయ్ ఆంటోని దర్శకుడు. ఈ చిత్రం అనువాద కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది.
ప్రేమ, యాక్షన్ తో కూడిన థ్రిల్లర్ గా ఈ చిత్రం రూపొందిందనీ, హిందీ, తమిళంలో సూపర్ హిట్ అయిందనీ సి.ఎస్.కుమార్ తెలిపారు. తెలుగు ప్రేక్షకులు కూడా ఈ చిత్రాన్ని హిట్ చేస్తారనే నమ్మకం తమకుందని అన్నారు. ఈ చిత్రానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తి అయ్యాయనీ, ఏప్రిల్ రెండో వారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామనీ తెలిపారు. ఈ చిత్రానికి విష్ణు నారాయణన్ సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|