కదిర్ డైరెక్షన్ లో వరుణ్
'హ్యాపీడేస్', 'కొత్త బంగారులోకం' వంటి హిట్ చిత్రాలతో యూత్ లో క్రేజ్ సంపాదించుకుని ఈవారంలోనే 'మరోచరిత్ర'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న వరుణ్ సందేశ్ హీరోగా శ్రీ మహా గణపతి ఫిలిమ్స్ పతాకంపై ఎం.సుధాకర్ ఓ భారీ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. సుధాకర్ ప్రస్తుతం శ్రీకాంత్ హీరోగా 'సేవకుడు' చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. తమ సంస్థ తదుపరి చిత్రంగా వరుణ్ సందేశ్ తో ఓ చిత్రాన్ని కదిర్ దర్శకత్వంలో రూపొందించనున్నట్టు సుధాకర్ ప్రకటించారు.
కదిర్ గతంలో రూపొందించిన 'హృదయం', 'ప్రేమదేశం', 'ప్రేమికుల రోజు' వంటి సెన్సేషన్ కథా చిత్రాల్ని ప్రేక్షకులు ఎంతగానో అందించారనీ, ఆయన దర్వకత్వంలో తమ సంస్థ ఐదవ చిత్రంగా వరుణ్ సందేశ్ తో సినిమా చేయబోతున్నామని ఆయన తెలిపారు. ఇందులో వరుణ్ సందేశ్ ఓ అద్భుతమైన పాత్ర పోషించనున్నారనీ, అలాగే ప్రపంచ ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారనీ తెలిపారు. ఆగస్టు 15న ఈ క్రేజీ చిత్రం ప్రారంభిస్తామని చెప్పారు. అదే నెల 24 నుంచి 20 రోజుల పాటు సెప్టెంబర్ , అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో షూటింగ్ జరిపి 2011 సంక్రాంతి కానుకగా సినిమా రిలీజ్ చేస్తామని చెప్పారు. కథ-స్క్రీన్ ప్లే సైతం కదిర్ అందించనున్న ఈ చిత్రానికి ఎం.సుధాకర్ ఛాయాగ్రహణం, వి.టి.విజయన్ ఎడిటింగ్ అందిస్తారు. నటీనటులు. ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.
Be first to comment on this News / Article!
|