మేథావులు మెచ్చిన 'లీడర్'
లీడర్ చిత్రాన్ని ప్రోత్సహించిన ప్రేక్షకులు, చిత్ర పరిశ్రమకు తన ధన్యవాదాలని వెంకటేష్ తెలిపారు. శేఖర్ కమ్ముల చక్కటి సబ్జెక్ట్ తో ఎంతో నిజాయితీగా చేసిన ప్రయత్నమే ఈ చిత్రమని అన్నారు. సినిమా రషెస్ చూసినప్పుడే సినిమా హిట్టవుతుందని తాను చెప్పాలనీ, రానా 'లీడర్', నాగచైతన్య 'ఏమాయ చేసావే' చిత్రాలను చక్కగా రిసీప్ చేసుకున్న ప్రేక్షకులకు మరోసారి కృతజ్ఞతలని అన్నారు. లీడర్ చాలా మంచి చిత్రమనీ, ఈ సినిమా కొనే అవకాశం తనకు వచ్చినప్పటికీ ఆ పని చేయలేకపోయాననీ, అందుకు ఇప్పుడు బాధపడుతున్నాననీ బెల్లంకొండ సురేష్ అన్నారు. రానా ఆంధ్ర అమితాబ్ అనీ, అలాగే దర్శకుడు శేఖర్ కమ్ముల మరిన్ని విజయాలు చవిచూడాలని అభిలషిస్తున్నాననీ పేర్కొన్నారు. చిత్ర విజయం పట్ల రిచా గంగోపాధ్యాయ్, ప్రియా ఆనంద్ తదితరులు సంతోషం వ్యక్తం చేసారు.
Be first to comment on this News / Article!
Pages: -1- 2
|