మేలో 'ఇష్టపడితే'
సుభాష్ రాయల్, ఫరాఖాన్ హీరోహీరోయిన్లుగా వరలక్ష్మి క్రియేషన్స్ పతాకంపై పడాల వెంకటరెడ్డి సమర్పణలో పడాల శ్రీరామ్ చంద్రారెడ్డి, పొలిశెట్టి చంద్రశేఖర్, ఆర్.సూర్యప్రకాష్, జి.లక్ష్మీనారాయణరెడ్డి నిర్మిస్తున్న చిత్రం 'ఇష్టపడితే'. దీనికి 'ప్రేమేనా' అనే ట్యాగ్ లైన్ ఉంది. ఎం.శ్రీనివాస్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం తుదిమెరుగుల దశలో ఉన్నట్టు నిర్మాతల్లో ఒకరైన పడాల శ్రీరామ్ చంద్రారెడ్డి తెలిపారు.
ఒక పాట మినహా షూటింగ్ పూర్తయిందనీ, రీరికార్డింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయనీ ఆయన చెప్పారు. ఏప్రిల్ 1,2.3 తేదీల్లో బ్యాలెన్స్ పాటను హైద్రాబాద్ లో చిత్రీకరించనున్నాననీ, ఆ పాట ఐటెం సాంగ్ గా సినిమాకే హైలైట్ అవుతుందని చెప్పారు. ఏప్రిల్ రెండో వారంలో ఆడియో, మేలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. ప్రేమ, ఆకర్షణ, ఇష్టం అనే మాటలను యువత ఎలా అర్ధం చేసుకుంటోందో ఈ చిత్రం ద్వారా చెప్పనున్నామనీ, సకుటుంబ సమేతంగా చూడదగిన సినిమా ఇదనీ చిత్ర సమర్పకుడు పడాల వెంకటరెడ్డి తెలిపారు. ఈచిత్రంలోని ఇతర పాత్రల్లో అమృతవల్లి, జీవా, కృష్ణ భగవాన్, రఘనాథరెడ్డి, వేణుమాధవ్, వినోద్, సత్యశ్రీ, ఉమారెడ్డి తదితరులు నటిస్తున్నారు. కథ-స్క్రీన్ ప్లే సైతం ఎం.శ్రీనివాస్ అందిస్తున్న ఈ చిత్రానికి సురేష్ మాటలు, శ్రీనివాసరెడ్డి ఎడిటింగ్, రాజ్ కిరణ్ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|