నిత్యానంద గెటప్ లో వడివేలు
తమిళంలో ప్రముఖ కమెడియన్ అయిన వడివేలు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ఇటీవల ఆయన హీరోగా ద్విపాత్రాభినయం చేసిన '23వ పులకేశి' చిత్రం ప్రేక్షకాదరణ చూరగొంది. తాజాగా ఆయన వివాదాస్పద స్వామి నిత్యానంద అవతారం ఎత్తబోతున్నారు. నిత్యానంద ఇటీవలే నటి రంజితతో కలిసి సెక్స్ స్కాండిల్ లో చిక్కుకుని సంచలనం సృష్టించారు. ఇప్పుడు వడివేలు తన తాజా చిత్రంలో నిత్యానందగా కనిపించబోతున్నారు. అయితే ఇది ఆ సినిమాలో ఆయన వేసే 23 గెటప్ లలో ఇదొకటి కావడం విశేషం. ఇంతవరకూ నవరాత్రి చిత్రం తమిళ వెర్షన్ లో శివాజీ గణేషన్, తెలుగు వెర్షన్ నో అక్కినేని నాగేశ్వరరావు 9 గెటప్స్ లో కనిపించగా, ఇటీవల కమల్ హాసన్ 'దశావతారం'లో 10 గెటప్ లలో కనిపించి రికార్డు సృష్టించారు. ఇప్పుడు ఆ రికార్డును 'ఉళగం' అనే చిత్రంలో వడివేలు బ్రేక్ చేయబోతున్నారు.
ఈ చిత్రం కోసం వడివేలు దాదాపు ఆరు నెలల పాటు డేట్లు కేటాయించారనీ, వడివేలు గెటప్స్ కోసం 'అవతార్' చిత్రానికి పనిచేసిన మేకప్ మన్ లను రప్పించనున్నారనీ తెలుస్తోంది. వడివేలు సరసన 10 మంది హీరోయిన్లు సైతం నటించబోతున్నారు. 150 కోట్ల భారీ బడ్జెట్ తో తమిళ, మలయాళ, తెలుగు, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని తీయబోతున్నారనీ, ఆదంభవ అనే యువ దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారనీ, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తారనీ తెలుస్తోంది.
Be first to comment on this News / Article!
|