హనుమ గుడి కట్టిస్తున్న అర్జున్
యాక్షన్ కింగ్ అర్జున్ ఇష్టదైవం హనుమంతుడు. ఈ మధ్యనే కృష్ణవంశీ తీసిన 'శ్రీ ఆంజనేయం' చిత్రంలో రామభక్త హనుమాన్ గా నటించి స్వామిపై తనకున్న భక్తి ప్రపత్తలను కూడా చాటుకున్నారు. తన ఆరాద్య దైవమైన ఆంజనేయ స్వామికి ఇప్పుడు స్వయంగా చెన్నైలో ఓ భవ్య మందిరాన్ని ఆయన నిర్మించబోతున్నారు. ఈ ఆలయంలో ఆంజనేయ స్వామి విగ్రహం 23 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇది ఏకశిలా విగ్రహం కావడం విశేషం. అలాంటి ఏకశిల కోసం ఏడాది పాటు ఆయన అన్వేషించారు. ఆయన కోరుకున్నట్టుగా విగ్రహాన్ని చెక్కడానికి మరో నాలుగేళ్లు పట్టింది. ఆంజనేయ స్వామి కూర్చున్న భంగిమలో చెక్కించిన ఈ విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఆంజనేయ విగ్రహం కానుంది. దీనిని చెన్నై నుంచి 160 చక్రాలున్న ట్రక్ ద్వారా చెన్నైకి రప్పించనున్నారు.
తన ఇష్టదైవమైన ఆంజనేయ స్వామి ఆలయాన్ని త్వరలోనే నిర్మించబోతున్నాననీ, అనంతరం విగ్రహ ప్రతిష్ట చేసి ప్రజలు దర్శించుకునే వీలు కల్పిస్తామని అర్జున్ తెలిపారు. ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు లారెన్స్ సైతం తన ఇష్టదైవమైన రాఘవేంద్రస్వామి ఆలయాన్ని ఇటీవల కట్టించారు.
Be first to comment on this News / Article!
|