అనుష్కతో 'నాగ' బంధం!
యోగా టీచర్ గా పనిచేసిన సెక్సీ బెంగుళూరు బ్యూటీ అనుష్క సినిమాల్లోకి వచ్చి తెలుగులో మంచి డిమాండ్ లో ఉన్నప్పటికీ హీరో నాగార్జునతో తనకున్న అనుబంధానికి కొనసాగింపుగా ఆయనతో మరోసారి జతకట్ట నుంది. నాగార్జున తమ బ్యానర్ లో తీసిన 'సూపర్' సినిమాతో అనుష్కను తెలుగు తెరకు పరిచయం చేశారు. ఆ చిత్రం తర్వాత అనుష్క క్రమంగా హీరోయిన్ గా తన సత్తా చాటుకుంటూ 'అరుంధతి' సూపర్ హిట్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు మహేష్ 'కలేజా', దర్శకుడు సముద్ర 'పంచాక్షరి', క్రిష్ 'వేదం' చిత్రాల్లో నటిస్తూ ఆమె నటిస్తూ బిజీగా ఉంది. తాజాగా నాగార్జునతో మరోసారి హీరోయిన్ గా నటించే అవకాశాన్ని కూడా అందిపుచ్చుకున్నట్టు సమాచారం.
నాగార్జున ప్రస్తుతం రాధామోహన్ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం 'పయనం' (వాంటెడ్)లో నటిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత కామాక్షి మూవీస్ పతాకంపై డి.శివప్రసాద్ రెడ్డి నిర్మించనున్న చిత్రానికి నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇటీవల 'బిందాస్' చిత్రంతో దర్శకుడిగా మారి తొలి సక్సెస్ ను చవిచూసిన వీరుపోట్ల ఈ తాజా చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఇందులో మెయిన్ హీరోయిన్ గా నటించేందుకు అనుష్క తన సమ్మతి తెలియజేసిట్టు సమాచారం. 'సూపర్' చిత్రం తర్వాత 'డాన్'లోనూ నాగార్జున సరసన హీరోయిన్ గా అనుష్క నటించగా, నాగార్జున 'కింగ్', 'కేడి' చిత్రాల్లో అనుష్క గెస్ట్ రోల్స్ పోషించింది. ముచ్చటగా మూడోసారి నాగార్జునతో మెయిన్ హీరోయిన్ ఛాన్స్ ఇప్పుడు దక్కించుకుంది. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి రాబోతోంది.
Be first to comment on this News / Article!
|