వివేక్ ఒబెరాయ్ 'ప్రిన్స్'
ఆంధ్రప్రదేశ్ లో 'రేస్' చిత్రం మంచి సక్సెస్ సాధించడంతో నిర్మాత కుమార్ తౌరని తన తాజా హిందీ చిత్రం 'ప్రిన్స్'ను సైతం అదే పేరుతో తెలుగులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వివేక్ ఒబెరాయ్ కథానాయకుడుగా నటిస్తున్న ఈ చిత్రంలో అరుణ షీల్డ్స్ , నందనా సేన్, నీరూ సింగ్ పూర్తి గ్లామర్ పాత్రలు పోషించారు. కూకీ కులాటి ఈ చిత్రానికి దర్శకుడు. సూపర్ తీఫ్ కథాంశంతో ఈ చిత్రాన్ని స్టయిలిష్ గా దర్శకుడు తెరకెక్కించారు.
పరుగులు తీయించే కెమెరా వర్క్, పదునైన ఎడిటింగ్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలనీ, ఇందులోని పాత్రల తీరుతెన్నులు, సినిమా ప్లాట్, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులకు పూర్తి వినోదాన్ని అందించడం ఖాయమనీ దర్శకుడు కుమార్ తౌరని తెలిపారు.
Be first to comment on this News / Article!
|