కొత్తవారితో 'శుభోదయం'
నూతన తారాగణంతో 'శుభోదయం' అనే చిత్రానికి శ్రీకారం చుట్టారు. శ్రీ సత్యనారాయణ క్రియేషన్స్ పతాకంపై కుప్పిలి శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంభవామి దర్శకత్వం వహిస్తున్నారు. హైద్రాబాద్ లోని ఫిలించాంబర్ లో గురువారంనాడు ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. హీరో హీరోయిన్లు కుప్పిలి శ్రీనివాస్, షఫాలి శర్మ, అపర్ణలపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి దర్శకుల సంఘం అధ్యక్షుడు సాగర్ క్లాప్ ఇచ్చారు.
దర్శకుడు సంభవామి మాట్లాడుతూ, చక్కటి ఫ్యామిలీ ఓరియెంటెండ్ చిత్రమిదనీ, ఇందులో సందేశం కూడా మిళితమై ఉంటుందనీ చెప్పారు. మవారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని నిర్మాత కె.శ్రీనివాస్ తెలిపారు. ఏడాదిగా స్క్రిప్టు రెడీ చేసుకుని, చిత్ర పరిశ్రమపై అహగాహన పెంచుకుని ఈ చిత్ర నిర్మాణాన్ని చేపట్టినట్టు చెప్పారు. ఇందులో తాము వైవిధ్యమైన పాత్రలు పోషిస్తున్నట్టు హీరోయిన్ల ఇద్దరూ పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంబంధించి నాలుగు పాటల రికార్డింగ్ పూర్తయినట్టు సంగీత దర్శకురాలు సింధు తెలిపారు.
Be first to comment on this News / Article!
|