ఎన్.శంకర్ తెలంగాణ చిత్రం
'ఎన్ కౌంటర్', 'శ్రీ రాములయ్య', 'జయం మనదేరా', 'భద్రాచలం' వంటి హిట్ చిత్రాల దర్శకుడు ఎన్.శంకర్ తాజాగా తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ప్రజల భావావేశాల నేపథ్యంలో వర్తమాన సామాజిక, రాజకీయ అంశాలను స్పృశిస్తూ ఓ కొత్త చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. అంతా కొత్త వారితో ఆయన ఈ చిత్రం తీయనున్నారు. హీరోహీరోయిన్ సహా 64 పాత్రలకు కొత్తవారిని ఎంచుకోనున్నారు. ఇందుకోసం స్టార్ హంట్ ను నిర్వహించబోతున్నట్టు శంకర్ తెలిపారు.
తెలంగాణ నేపథ్యంలో రూపొందనున్న చిత్రమే అయినప్పటికీ అన్ని ప్రాంతాల వారిని అలరించేలా ఈ చిత్రం ఉంటుందనీ, ఏప్రిల్ నెలాఖరులో నటీనటుల ఎంపిక పూర్తి చేసి మే నెలాఖరుకు సెట్స్ మీదకు వెళ్లే విధంగా ప్లాన్ చేస్తున్నామనీ ఆయన చెప్పారు. తన మిత్రులతో కలిసి సొంతంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాననీ, త్వరలోనే సినిమా పేరు, నిర్మాణ సంస్థ తదితర వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
Be first to comment on this News / Article!
|