ఇండియాలో 'ది హర్ట్ లాకర్'
ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించి 6 ఆస్కార్ అవార్డులు, 6 బాఫ్టా అవార్డులతో పాటు 66 అంతర్జాతీయ అవార్డులు పొందిన'ది హర్ట్ లాకర్' చిత్రం ఇండియాలో ఏప్రిల్ 9న విడుదల కానుంది. ఉత్తమ దర్శకురాలిగా ఆస్కార్ ను సాధించిన తొలి మహిళగా రికార్డులు సృష్టించిన కేథరిన్ బిగెలో దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. మార్క్ బోయల్, నికొలస్ కార్టియర్, గ్రెగ్ షపిరోలతో కలిసి బిగెలో ఈ చిత్రాన్ని నిర్మించారు. మల్టీవిజయన్ మల్టీ మీడియా (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ భారత్ లో ఈ చిత్రాన్ని అందిస్తోంది.
'ది హర్ట్ లాకర్' చిత్రాన్ని 2004 ఇరాక్ యుద్ధంగా అమెరికన్ సైనికుల అనుభవాల నేపథ్యంలో దర్శకురాలు తెరకెక్కించారు. జెర్ మీ రెన్నర్, ఆంధోని మెకీ, బ్రియాన్ జరగ్తీ ప్రధాన పాత్రలు పోషించారు. మార్క్ బోయల్ అనే ఫ్రీలాన్స్ జర్నలిస్టు రాసిన స్వీయ అనుభవాల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది.
Be first to comment on this News / Article!
|