'వరప్రసాద్ & పొట్టిప్రసాద్'
అవసరాల శ్రీనివాస్ ('అష్టా చమ్మా' ఫేమ్), విజయ్ సాయి ముఖ్య పాత్రల్లో జియో మీడియా ఆర్ట్ పతాకంపై హర్షారెడ్డి నిర్మిస్తున్న కామెడీ ఎంటర్ టైనర్ 'వరప్రసాద్ & పొట్టిప్రసాద్'. సత్యవారణాసి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రామానాయుడు స్టూడియోస్ లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. ముహూర్తం సన్నివేశానికి యువ హీరో అల్లరి నరేష్ క్లాప్ ఇవ్వగా, ప్రముఖ దర్శకుడు చంద్ర సిద్దార్ధ కెమెరా స్విచ్చాన్ చేశారు. మరో హీరో శర్వానంద్ గౌరవ దర్శకత్వం వహించారు.
హర్షారెడ్డి మాట్లాడుతూ, గతంలో తాము 'అందరూ దొంగలే' చిత్రం తీశామనీ, ఐదేళ్ల క్రితమే ఈ చిత్రం చేద్దామనుకున్నామనీ చెప్పారు. ఇందులో అనేక మంది కమెడియన్లు, ఇద్దరు ప్రముఖ హీరోలు కూడా నటించనున్నారని తెలిపారు. పూర్తి వినోదాత్మకంగా ఈ చిత్రం ఉంటుందని సత్యవారణాసి తెలిపారు. 'అష్టాచమ్మా' తర్వాత తన రెండో చిత్రం ఇదనీ, తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రం రూపొందనుందనీ అవసరాల శ్రీనివాస్ తెలిపారు. కథానాయిక ప్రియాంక మాట్లాడుతూ, కన్నడంలో మూడు సినిమాలలో నటించిన తెలుగు తెలుగులో ఇది తొలి చిత్రమని అన్నారు. ఇందులో నాలుగు పాటలు ఉంటాయనీ, అవన్నీ వినోదాత్మకంగా ఉంటాయనీ చిత్ర సంగీత దర్శకుడు సాయికార్తీక్ తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో రఘబాబు, పోసాని కృష్ణమురళి, మాస్టర్ భరత్ తదితరులు నటిస్తున్నారు. దావుటూరి మాటలు, బాల సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|