'సిరిమల్లెపువ్వు' మొదలు
భరత్ పారేపల్లి దర్శకత్వంలో 'సిరిమల్లెపువ్వు' అనే కొత్త చిత్రం ప్రారంభమైంది. నీలం శంకర్ నిర్మాత. నితీష్, కీర్తి, నాగశ్రీ, ద్యోతి, రష్మి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తం సన్నివేశానికి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జి.వెంకటస్వామి క్లాప్ ఇవ్వగా, రాష్ట్ర మంత్రి సుదర్శన్ రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు. సాగర్ గౌరవ దర్శకత్వం వహించారు.
నీలం శంకర్ మాట్లాడుతూ, కన్నడంలో విజయవంతమై, ఐదు ఫిల్మ్ ఫేర్ అవార్డులు కూడా గెలుచుకున్న 'మొగ్గిన మనసు' చిత్రానికి ఇది రీమేక్ అనీ, కాలేజీ బ్యాక్ డ్రాప్ లో సినిమా ఉంటుందనీ చెప్పారు. రెగ్యులర్ షూటింగ్ ఏప్ిరల్ 10 నుంచి రాజమండ్రి పరిసరాల్లో చేస్తామనీ, జూన్ లో సినిమా విడుదలకు ప్లాన్ చేశామనీ చెప్పారు. ఈ చిత్రంలో నటిస్తుండటం పట్ల హీరోహీరోయిన్లు తమ సంతోషం వ్యక్తం చేశారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో కోట శ్రీనివాసరావు, ఆరీ, కీర్తి తదితరులు నటించనున్నారు.
Be first to comment on this News / Article!
|