'సర్యం' ఆడియో రిలీజ్
ఆర్య, త్రిష హీరోహీరోయిన్లుగా జె.డి.చక్రవర్తి ముఖ్య పాత్రలో విష్ణువర్దన్ దర్శకత్వంలో రూపొందిన ఓ చిత్రాన్ని తెలుగులోకి 'సర్వం' పేరుతో అనువదిస్తున్నారు. సి.అరుణ్ పాండ్యన్ నిర్మాత. సింహపురి టాకీస్ పతాకంపై రఘునాథ్ ఎం.నరేంద్ర సమర్పణలో ఈ చిత్రం అనువాదమవుతోంది. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఆడియోను సాగర్ విడుదల చేసి తొలిప్రతిని భీమినేని శ్రీనివాసరావుకు అందించారు. అరుణ్ పాండ్యన్, శ్రీధర్ రెడ్డి, రఘనాథ్, శశాంక్ వెన్నెలకంటి, జె.డి., ఆర్య, వీరశంకర్ తదితరులు పాల్గొన్నారు.
సాగర్ మాట్లాడుతూ, అరుణ్ పాండ్యన్ చాలా మంచి సినిమాలో భారీ ఎత్తున తీస్తున్నారనీ, ఈ చిత్రం తెలుగులో మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాననీ అన్నారు. 'అనంతపురం' సినిమా ద్వారా ఈ చిత్ర తెలుగు నిర్మాతలు మంచి నిర్మాతలుగా నిరూపించుకున్నారనీ, అలాగే ఆర్య టెరిఫిక్ యాక్టర్ అనీ భీమినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆర్య ఇప్పుడు 'వరుడు' సినిమాలో విలన్ గా నటిస్తుండగా, మన జె.డి.చక్రవర్తి తెలుగు నుంచి హిందీకి అక్కడినుంచి తమిళ పరిశ్రమకు వెళ్లి బిజీగా ఉన్నారని అన్నారు. టైటిల్ లో మంచి ఫీల్ ఉందనీ, చక్కటి స్క్రీన్ ప్లే, చైల్డ్ సెంటిమెంట్ ఇందులో ఉన్నాయని శశాంక్ వెన్నెలకంటి పేర్కొన్నారు. తమిళ బిల్లా తర్వాత విష్ణువర్దన్ చేసిన ఈ చిత్రంపై తెలుగులో మంచి అంచనాలు ఉన్నట్టు రఘనాథ్ అన్నారు. అరుణ్ పాండ్యన్ మాట్లాడుతూ, నటుడిగా తెలుగు ప్రేక్షకులకు తాను తెలుసుననీ, తమిళంలో పది సినిమాలు నిర్మించాననీ, ఇది పెద్ద బడ్జెట్ సినిమా అనీ అన్నారు. ఇందులో ఓ పాట కోసం కోటిన్నర ఖర్చు చేశామనీ, త్వరలోనే ఓ తెలుగు సినిమా కూడా నిర్మించాలనే ఆలోచన ఉందనీ చెప్పారు. ఆర్య మాట్లాడుతూ, తన చిత్రాల్లో ఇది ఉత్తమ చిత్రమని అన్నారు. జెడి మాట్లాడుతూ, ఈ సినిమా తీస్తున్నప్పుడు అరుణ్ పాండ్యన్ రెండు సార్లే సెట్ దగ్గరకు వచ్చారనీ, ఈ సినిమా తెలుగులో మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాననీ అన్నారు.
Be first to comment on this News / Article!
|