కడప దర్గాలో అల్లు అర్జున్
యువ హీరో అల్లు అర్జున్ కడపలోని ప్రఖ్యాత అమీన్ పీర్ దర్గాను శుక్రవారంనాడు సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. అల్లు అర్జున్ కథానాయకుడుగా నటించిన 'వరుడు' చిత్రం ఈనెల 31న విడుదల కానుంది. ఈ చిత్రం సక్సెస్ ను కోరుకుంటూ కడప దర్గాను ఆయన సందర్శించారు. శ్రీరామనవమి సందర్భంగా ఈనెల 24న ఆయన హైద్రాబాద్ ఫిల్మ్ నగర్ లోని రామాలయంలో ప్రత్యేక పూజలు కూడా జరిపించారు. సీతారామచంద్రులకు పట్టువస్త్రాలు సమర్పించి అదే ఆలయ ప్రాంగణం నుంచి తన సినిమా రిలీజ్ తేదీని కూడా ప్రకటించారు.
కడప అమీన్ పీర్ దర్గాను సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు తరచు దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు జరుపుతుంటారు. కొద్దికాలం క్రితం అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య దంపతులు, ఎ.ఆర్.రెహమాన్ ఈ దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రామ్ చరణ్ సైతం 'మగధీర' రిలీజ్ కు ముందు ఈ దర్గాను సందర్శించారు.
Be first to comment on this News / Article!
|