నాగార్జున కూల్ కూల్...
ఇవాల్టి యువ హీరోలు బ్రాండ్ అంబాసిడర్లుగా కూడా దున్నేస్తుంటే కాస్త లేటుగా అయినా సీనియర్ హీరో నాగార్జున సైతం 'బ్రాండ్' బరిలోకి దూకారు. సినిమా సినిమాకి నాగార్జున నవ మన్మథుడుగా గ్లామర్ పెంచుకుంటూ పోవడం అందర్నీ ఆశ్చర్య చకితుల్ని చేస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకునే ఈ నవయుగ సామ్రాట్ ను హెయిర్ ఆయిల్ ప్రోడక్ట్ ప్యారాచూట్ కంపెనీ తమ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేసింది.
సమ్మర్ హీట్ ను తట్టుకుని నిలబాడాలన్నా, మెదడు చల్లగా ఉంచుకోవాలన్నా, తలనొప్ప దరిచేరకుండా ఉండాలన్నా ప్యారాచూట్ వాడండి...ఇక సమ్మర్ హీరోలు మీరేనంటూ నాగార్జున ప్రచారం చేపట్టబోతున్నారు. మొదట తాను వాడి చూసిన తర్వాతే తనకు నచ్చి బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేసేందుకు అంగీకరించినట్టు నాగార్జున ఈ ప్రోడక్ట్ లాంచింగ్ కార్యక్రమంలో చెప్పుకొచ్చారు. మెగాస్టార్ చిరంజీవి అప్పట్లో 'నవరతన్'కు బ్రాండ్ అంబాసిడర్ గా చేశారు. ఇప్పుడు ఆ ప్రోడక్ట్ మహేష్ చేతుల్లోకి వచ్చింది. ఇక సమ్మర్ కూల్ డ్రింక్ ల వ్యవహారానికి వస్తే 'ధమ్స్ అప్' కూల్ డ్రింక్ సైతం చిరంజీవి నుంచి మహేష్ కు చేరింది. పెప్సీకి రామ్ చరణ్, సెవన్ అప్ కి అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|