ఎన్టీఆర్ నిశ్చితార్ధం 1న
యంగ్ టైగర్ ఎన్టీఆర్ వివాహ నిశ్చితార్ధం ఏప్రిల్ 1న జరగనుంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మేనకోడలు మల్లిక, నార్నె శ్రీనివాసరావుల కుమార్తె లక్ష్మీ ప్రణితితో ఎన్టీఆర్ వివాహ నిశ్చితార్ధం జరగనుంది. జూబ్లీ హిల్స్ లోని నార్నె శ్రీనివాసరావు నివాసంలో ఈ వేడుకను నిర్వహించనున్నారు.
నిశ్చితార్ధం కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులకే పరిమితం చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. నిజానికి కొద్దిరోజుల క్రితమే నిశ్చితార్థం జరగాల్సి ఉన్నప్పటికీ లక్ష్మీ ప్రణతి మైనర్ అంటూ అభ్యంతరాలు తలెత్తడంతో ఆ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఇప్పుడు ప్రణతి మేజర్ కావడంతో ఆ అభ్యంతరాలు తొలగిపోయాయి. ఎన్టీఆర్ హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న 'బృందావనం', అశ్వనీదత్ నిర్మిస్తున్న 'శక్తి' చిత్రాలు ప్రస్తుతం శరవేగంగా నిర్మాణం జరుపుకొంటున్నాయి.
Be first to comment on this News / Article!
|