బిందాస్ @ 50
మంచు మనోజ్, షీనా జంటగా ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సుంకర రామబ్రహ్మం నిర్మించిన 'బిందాస్' విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ చిత్రం ద్వారా రచయిత వీరుపోట్ల తొలిసారి దర్శకుడుగా మారారు. ఫిబ్రవరి 5న ఈ చిత్రం విడుదలై మంచు మనోజ్ కు తొలిసారి సరైన సక్సెస్ ను అందించింది.
ఇది లవ్ స్టోరీ కాదనీ, స్టోరీ ఆఫ్ లవ్ అనీ ఈ చిత్రానికి నిర్మాత ఇచ్చిన వినూత్న పబ్లిసిటీ, సినిమా నచ్చకపోతే డబ్బులు వాపసు అంటూ చేసిన ప్రచారం ఈ చిత్ర విజయంలో కీలక భూమిక పోషించింది. వినోదంతో కూడిన యాక్షన్ ద్వారా మంచు మనోజ్ ఈ చిత్రాన్ని ఒంటిచేత్తో నడిపించగా, షీనా గ్లామర్ మరో హైలైట్ అయింది. ఈ చిత్రం తర్వాత ఇటు మంచు మనోజ్ తో పాటు సుంకర రామబ్రహ్మం, వీరుపోట్ల తమ తదుపరి ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. మంచు మనోజ్ ప్రస్తుతం కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఒక చిత్రం, క్రిష్ దర్శకత్వంలో 'వేదం' చిత్రంలో నటిస్తున్నారు. సుంకర రామబ్రహ్మం అల్లరి నరేష్, శ్రీహరి ప్రధాన పాత్రల్లో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వీరుపోట్ల ఎకాఎకిన నాగార్జున చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు.
Be first to comment on this News / Article!
|