పవన్-జయంత్ చిత్రం షురూ
పవన్ కల్యాణ్ కథానాయకుడుగా బడే రవి సమర్పణలో పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై నటుడు గణేష్ బాబు నిర్మిస్తున్న కొత్త చిత్రం షూటింగ్ ముహూర్తం హైద్రాబాద్ లోని తాజ్ కృష్ణా హోటల్ లో సోమవారంనాడు ఆర్భాటంగా జరిగింది. ఈ చిత్రానికి జయంత్ జి.పరాన్జీ దర్శకుడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన, మణిశర్మ సంగీతం, బినోద్ ప్రధాన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. పవన్ కల్యాణ్ పై చిత్రీకరించిన ముహూర్తం సన్నివేశానికి బొత్సా ఝాన్సీరాణి (ఎంపి) క్లాప్ ఇవ్వగా, గోవా గుట్కా యజమానులైన హనూరుద్దీన్, జయన్ లు కెమెరా స్విచ్చాన్ చేశారు. దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు గౌరవ దర్శకత్వం వహించారు. చిత్ర దర్శక నిర్మాతలతో పాటు మంత్రులు బొత్సా సత్యనారాయణ, దానం నాగేందర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే జె.పి.దివాకర్ రెడ్డి, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, పరుచూరి వెంకటేశ్వరరావు, గౌతంరాజు తదితర రాజకీయ, సినీ ప్రముఖులు ఇందులో పాల్గొన్నారు.
నిర్మాత గణేష్ మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ తో ఒక సినిమా చేయాలనే రెండేళ్ల కల ఇప్పుడు నిజమవుతోందనీ అన్నారు. పవన్ కల్యాణ్ కెరీర్ లోనే ఇది చాలా పెద్ద బడ్జెట్ సినిమా అవుతుందనీ, బడ్జెట్ కంట్రోల్ ఉండదనీ చెప్పారు. పవన్ కెరీర్ లోనే ఈ చిత్రాన్ని పెద్ద హిట్ చేయాలని సంకల్పించనట్టు చెప్పారు. పాటల రికార్డింగ్ పూర్తి చేసి జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్తామని తెలిపారు. దర్శకుడు జయంత్ మాట్లాడుతూ, ఇది హిందీలో విజయవంతమైన 'లవ్ ఆజ్ కల్' చిత్రానికి రీమేక్ అనీ, అయితే మెయిన్ థీమ్ ను తీసుకుని సన్నివేశాలను ఫ్రెష్ గా రచయిత త్రివిక్రమ్ రాశారనీ చెప్పారు. పవన్ తో చాలా ఏళ్ల క్రితమే ఓ సినిమాను ప్లాన్ చేశాననీ, అయితే అదే సమయంలో తాను 'బావగారూ బాగున్నారా' చిత్రానికి చేయడంతో తాము అనుకున్న ప్రాజెక్ట్ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చిందన్నారు. తమ కాంబినేషన్ వర్కవుట్ కావడానికి పన్నెండేళ్లు పట్టిందన్నారు. ఇది చాలా ఎనర్జిటిక్ ప్రాజెక్ట్ అనీ, ఫ్యాన్స్, ప్రేక్షకుల అంచనాలను మించే విధంగా ఈ చిత్రం ఉంటుందనీ తెలిపారు. ఇందులో ఇద్దరు హీరోయిన్లు, ఒక గెస్ట్ ఆర్టిస్ ఉంటారనీ, మణిశర్మ సంగీతం అందిస్తున్నారనీ, నాలుగైదు రోజుల్లో మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణులను పైనలేజ్ చేయనున్నామనీ చెప్పారు.
Read 1 Comment(s) posted so far on this News / Article!
|