హనీ...పంచాక్షరి
'అరుంధతి' చిత్రంలో డ్యూయెల్ రోల్ పోషించి నటిగా సత్తాచాటిన అనుష్క మరోసారి హీరోయిన్ ఓరియెంటెడ్ కథాంశంతో సముద్ర దర్శకత్వంలో బొమ్మదేవర రామచంద్రరావు నిర్మిస్తున్న 'పంచాక్షరి' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఇందులో హనీగా, పంచాక్షరిగా అనుష్క మళ్లీ ద్విపాత్రాభినయం చేయనుండటం విశేషం. హైద్రాబాద్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో చిత్రయూనిట్ సమావేశమై ఆ విశేషాలను తెలియజేసింది.
తొలుత అనుష్క మాట్లాడుతూ, ఇందులోహనీ పాత్ర చాలా సరదాగా ఉంటుందనీ, పంచాక్షరి పాత్ర గురించి ఇప్పుడే చెప్పడం సబబు కాదనీ అన్నారు. గ్రామీణ నేపథ్యంలో పంచాక్షరి పాత్ర ఉంటుందనీ, అయితే అరుంధతికీ, పంచాక్షరికీ ఏమాత్రం పోలిక ఉండదనీ చెప్పారు. బ్రహ్మానందం మాట్లాడుతూ, ఇందులో తనకూ, అనుష్కకూ మధ్య 'మగధీర' ప్యారడీ ఉంటుందన్నారు. నిర్మాతకు పరిశ్రమతో పాతికేళ్ల అనుబంధం ఉందనీ, ఆ అవగాహనతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారనీ తెలిపారు. అరుంధతి తర్వాత ఇప్పుడు అందరి దృష్టి పంచాక్షరిపైనే ఉందనీ, వారి అంచనాలకు తగ్గకుండా ఈ చిత్రం మరో పెద్ద హిట్ సాధిస్తుందని సముద్ర తెలిపారు. మంచి సినిమా తీయాలనే లక్ష్మంతోనే ఈ చిత్రాన్ని నిర్మించినట్టు బొమ్మదెవర రామచంద్రరావు తెలిపారు. ఈ సమావేశంలో సీనియర్ నటుడు చంద్రమోహన్, కమెడియన్ రఘబాబు పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|