యదార్థ కథతో 'ప్రేమిస్తావా'
ఆర్కేస్ సినిమా పతాకంపై శ్రీమతి మందపాటి అనసూయ సమర్పణలో తమిళంలో విజయవంతమైన 'పూడి చిరుకు' చిత్రాన్ని తెలుగులో 'ప్రేమిస్తావా' పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. దీనికి కనగు దర్శకుడు.
చిత్ర విశేషాలను నిర్మాత ఎంవిఆర్ కృష్ణ తెలియజేస్తూ, తమిళనాడులో జరిగిన ఓ యదార్ధ సంఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిందనీ, ఇందులో ఐదు పాటలు ఉంటాయని చెప్పారు. వనమాలి అందించిన సాహిత్యం ఈ చిత్రానికి ప్రధాన ఎస్సెట్ అనీ అన్నారు. ఇదొక డిఫరెంట్ లవ్ స్టోరీ కావడంతో మను రమేష్ చక్కటి సంగీతం అందించారనీ, యువతను ఉర్రూత లూగించే విధంగా సంగీతం ఉంటుందనీ తెలిపారు. ప్రస్తుతం సాంగ్స్ రికార్డింగ్ జరుగుతున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ నెలాఖరులో రిలీజ్ చేయాలనుకుంటున్నట్టు చెప్పారు. అశోక్, విశాఖ, శరణ్య, సంపత్, కంచకరపు తదితరులు నటించిన ఈ చిత్రానికి రాధాకృష్ణ మాటలు, డి.వి.రామేశ్వరన్ సినిమాటోగ్రఫీ అందించారు.
Be first to comment on this News / Article!
|