75 ప్రింట్లతో 'పోలీస్ పోలీస్'
పోలీసు కథాంశంతో గతంలో ఎన్నో చిత్రాలు వచ్చినప్పటికీ వాటిని భిన్నంగా 'పోలీస్ పోలీస్' చిత్రాన్ని రూపొందించామని ఆ చిత్ర దర్శకుడు మన్ మోహన్ తెలిపారు. శ్రీరామ్, పృధ్వీరాజ్, కమలిని ముఖర్జీ ప్రధాన పాత్రల్లో పినాకిల్ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై రూపొందిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఏప్రిల్ 9న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు మన్ మోహన్ తెలిపారు.
పోలీసు శాఖకు సంబంధించి ఎంతో పరిశోధన చేసి ఆ శాఖలోని మంచి చెడులను విశ్లేషిస్తూ తీసిన చిత్రమిదని ఆయన తెలిపారు. శ్రీరామ్ తెలగువాడేన్న విషయం అందిరికీ తెలిసిందేననీ, పృధ్వీరాజ్ ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో రావణ్ చిత్రంలో టైటిల్ పాత్ర పోషిస్తున్నారనీ, కమలిని నటనాపటమి తెలియంది కాదనీ ఆయన అన్నారు. అలాగే సంజన రొమాంటిక్ అమ్మాయిగా నటించగా, బ్రహ్మాజీ మరో చక్కటి పాత్ర పోషించారని అన్నారు. ఈ చిత్రం చూసి ఎంతో స్పందించి తాము సినిమా విడుదల చేస్తున్నట్టు నట్టికుమార్ తెలిపారు. ముందుగానే మంచి మంచి థియేటర్లను రాష్ట్రవ్యాప్తంగా ఎంచుకున్నామనీ, 75 ప్రింట్లతో 120 థియేటర్లలో సినిమా రిలీజ్ చేస్తున్నామనీ చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో దండపాణి, విక్రమ్, ఆహుతి ప్రసాద్, ప్రసాద్ బాబు తదితరులు నటించారు. భరణి కె.ధరన్ సినిమాటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, సాయికార్తీక్ సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|