'మారో' అంటున్న నితిన్
తన జీవితంలో ఎదురైన సమస్యలను బుద్ధిబలంతో కథానాయకుడు ఎదుర్కొన్న ఇతివృత్తంతో రూపొందిన చిత్రం 'మారో'. నితిన్, మీరాచోప్రా జంటగా సిద్ధిక్ దర్శకత్వంలో శ్రీ రాజరాజేశ్వరి ఫిలింస్ పతకంపై మామిడాల శ్రీనివాస్, వేణు ఎం.కొండ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న ఫిలిం చాంబర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మామిడాల శ్రీనివాస్ తెలిపారు.
యాక్షన్ తో కూడిన వినోదభరిత చిత్రమిదనీ, ఇంతవరకూ ఫెయిల్యూర్స్ అంటే తెలియని సిద్ధిక్ దర్శకత్వ ప్రతిభ ప్రతి ఫేమ్ లోనూ కనిపిస్తుందనీ ఆయన చెప్పారు. మలయాళంలో సిద్దిక్ దర్శకత్వం వహించిన అనేక చిత్రాలు తెలుగులో రీమేక్ అయ్యాయనీ, హిట్లర్, పెద్దరికం వంటి చిత్రాలు వాటిలో ఉన్నాయనీ చెప్పారు. మైండ్ గేమ్ ప్రదానంగా ఈ చిత్రం ఉంటుందనీ, కామెడీకీ మంచి ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు యాక్షన్ సన్నివేశాలలో కూడా కామెడీ మిళితమై ఉంటుందన్నారు. మణిశర్మ సంగీతం మరో హైలైట్ అవుతుందన్నారు. అతిథిగా పాల్గొన్న నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్నకుమార్ మాట్లాడుతూ, సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను తప్పనిసరిగా అలరిస్తుందన్నారు. మరో అతిథిగా విచ్చేసిన దర్శకుడు నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ, మాస్ ఇమేజ్ ఉన్న నితిన్ ఇందులో కొత్త క్యారెక్టరైజేషన్ తో ప్రేక్షకులను అలరిస్తారని చెప్పారు. క్లైమాక్స్, ఇంట్రడక్షన్ ఫైట్ తో పాటు ఇందులోని నాలుగు ఫైట్స్ ఎంతగానో ఆకట్టుకుంటాయని స్టంట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో అబ్బాస్, కోట శ్రీనివాసరావు, ఆలీ, వేణుమాధవ్, రఘుబాబు, చలపతిరావు, నరసింహరాజు, రమాప్రభ, కవిత తదితరులు నటించారు. చింతపల్లి రమణ మాటలు, జయరామ్ సినిమాటోగర్ఫీ, టి.ఆర్.శేఖర్, కె.ఆర్.గౌరీశంకర్ ఎడిటింగ్ అందించారు.
Be first to comment on this News / Article!
|