బిందు మాధవి 'ప్రతిరోజు'
ఆవకాయ్ బిర్యానీ, బంపర్ ఆఫర్, ఓంశాతి చిత్రాలతో యూత్ ను అలరించిన తెలుగమ్మాయి బిందు మాధవి ఇప్పుడు 'ప్రతిరోజు' అనే చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. రవిబాబు ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని ప్రకాష్ వి.ప్రొడక్షన్స్ పతాకంపై నాగేందర్.వి నిర్మిస్తున్నారు. రాజు రాజేంద్ర పారసాద్ దర్శకుడు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకొంటోంది.
నిర్మాత నాగేందర్ మాట్లాడుతూ, యదార్థ సంఘటనల నేపథ్యంలో ఈ చిత్రం సహజత్వానికి దగ్గరగా ఉంటుందనీ, త్వరలోనే సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నామనీ చెప్పారు. సినిమా చాలా కొత్తగా ఉంటుందనీ, ప్రతి ఫేము ఆలోచింపజేస్తుందనీ దర్శకుడు తెలిపారు. రవిబాబు నటన సినిమాకి ప్రధాన హైలైట్ గా ఉంటుందనీ, టైటిల్ తరహాలోనే సినిమా కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందనీ చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో చరలపతిరావు, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి, అయేషా జలీల్, దువ్వాసి, హేమ, హర్షవర్దన్, సత్యం రాజేష్, రాజ్యలక్ష్మి తదితరులు నటించారు. వంశీ సినిమాటోగ్రఫీ, శామ్ ప్రసేన్ సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|