నవరసాల 'కోతిమూక'
కృష్ణుడు ('వినాయకుడు' ఫేమ్), శ్రద్ధ ఆర్య జంటగా తులసి పూజిత ఫిలిమ్స్ పతాకంపై ప్రముఖ కమెడియన్ ఏవీయస్ దర్శకత్వంలో వెంకట్ జగదీష్ నిర్మిస్తున్న ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్ 'కోతిమూక'. ఇంతవరకూ 70 శాతం షూటింగ్ పూర్తయింది. ప్రధాన తారాగణం పాల్గొనగా రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రస్తుతం కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. కామెడీ ప్రధానంగా సాగే ఈ చిత్రంలో నవరసాలు ఉంటాయని ఏవియస్ తెలిపారు.
కోతులే లంకకు వారథి కట్టాయనీ, శ్రీరామునికి ఘనవిజయం చేకూర్చిపెట్టాయనీ, ఈ చిత్రంలో కూడా కోతిమూక ఇతరులకు ఉపయోగపడే పనులు చేస్తుందని ఆయన అన్నారు. మరి కొద్ది రోజుల్లోనే షూటింగ్ పూర్తవుతుందనీ, ప్రస్తుతానికి ఒక పాట పూర్తి చేసామనీ చెప్పారు. రెండు పాటలు విదేశాల్లో చిత్రీకరిస్తామని తెలిపారు. తన కెరీర్ లో ఇది ఒక మంచి చిత్రంగా నిలుస్తుందని కృష్ణుడు పేర్కొన్నారు. ఈ చిత్ర కథ తనకెంతో నచ్చిందనీ, ఈ యూనిట్ తో పనిచేస్తూ తెలుగు కూడా నేర్చుకుంటున్నాననీ శ్రద్ధ ఆర్య తెలిపింది. ప్రతి తెలుగువాడు చూడదగిన చిత్రమిదని సీనియర్ నటుడు జయప్రకాష్ రెడ్డి తెలిపారు. కోవైసరళ మాట్లాడుతూ, ఏవియస్ డైరెక్షన్ లో రూపొందిన 'ఓరి నీ ప్రేమ బంగారం కానూ' సినిమా ద్వారా తనకు నంది అవార్డు లభించిందనీ, ఈ చిత్రంలోనూ మంచి పాత్ర పోషిస్తున్నాననీ చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో డాక్టర్ బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, ఆలీ, ఎమ్మెస్ నారాయణ, చిట్టిబాబు, వేణుమాధవ్, రఘబాబు, జీవా, కొండవలస, గుండు హనుమంతరావు, హర్షవర్దన్, ఉత్తేజ్, గుండు సుదర్శన్, కోవై సరళ, హేమ, కల్పన తదితరులు నటిస్తున్నారు. కథ-స్క్రీన్ ప్లై సైతం ఏవియస్ అందిస్తున్న ఈ జనార్దన మహర్షి మాటలు, స్వర్గీయ ఆరుద్ర, రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల పాటలు, వి.శ్రీనివాసరెడ్డి సినిమాటోగ్రఫీ, ఎం.ఆర్.వర్మ ఎడిటింగ్, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|